ఖైదీ నెంబర్ 150 చిత్రంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి అనుకున్నట్టుగానే రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. మెగా స్టార్ ఎంట్రీతో గతంలో ఉన్న కలెక్షన్ల రికార్డులు పటాపంటెలవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు . 9 ఏళ్ల విరామం తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి అవలీలగా వంద కోట్ల షేర్ ని సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించాడు . ఇప్పుడున్న హీరోలకు యాభై కోట్ల ని సాధించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో మెగాస్టార్ అవలీలగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు . మిగతా హీరోలకు చిరంజీవి కి తేడా ఏమిటంటే మిగతా హీరోలు నటించిన సినిమాలు ఇతర భాషలలో కూడా రిలీజ్ అయి భారీ వసూళ్ల ని సాధించగా చిరు నటించిన ఖైదీ నెంబర్ 150 మాత్రం కేవలం తెలుగులో రిలీజ్ అయి ఇంతటి భారీ వసూళ్ల ని సాధించింది.

బాహుబలి తప్పించి మిగతా చిత్రాల్లో మొన్నటి వరకు మహేష్ నటించిన శ్రీమంతుడు నెంబర్ వన్ గా ఉండేది కానీ ఆ రికార్డ్ ని చిరు బద్దలు కొట్టాడు  చిరంజీవి దాంతో నెంబర్ వన్ చిత్రంగా వంద కోట్ల షేర్ ని సాధించిన ఖైదీ నెంబర్ 150 నిలిచింది . వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ తేజ్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ అయ్యింది .