ఖాళీగా వుంటే అరవయేళ్లు వచ్చాయిగా.. నాన్న రెస్ట్ తీసుకుంటున్నాడా అన్నారు: సుష్మిత

First Published 19, Dec 2017, 12:10 PM IST
mega star chranjeevi daughter sushmitha about her father
Highlights
  • తనకు ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తున్న మెగా డాటర్ సుష్మిత
  • ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలు పంచుకున్న సుష్మిత
  • సినిమాలు మానేసి ళీగా రెస్ట్  తీసుకోవటం నాన్నకు ఇష్టంలేదన్న సుష్మిత

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కూడా సినిమా రంగలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. తెర వెనక కాస్టూమ్ డిజైనర్ గా ఆమె తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సుష్మిత తన సోదరుడు రామ్ చరణ్ మూవీ 'రంగస్థలం', తండ్రి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి పని చేస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సుష్మిత తమ ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

 

తండ్రి మెగాస్టారర్ చిరంజీవి గురించి మాట్లాడుతూ... సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత నాన్న ఒకానొక సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. చాలా మంది మెగాస్టార్ వయసు 60 ఏళ్లు దాటింది కదా, ఇంట్లో కూర్చుని హ్యాపీగా రెస్టు తీసుకుంటున్నారని భావించేవారు. కానీ అలా ఇంట్లో విగ్రహంలా కూర్చోవడం నాన్నకు ఇష్టం ఉండేది కాదు, షూటింగులకు వెళ్లకుండా ఉండటం నాన్నకు సంతోషాన్ని ఇచ్చేది కాదని సుష్మిత చెప్పారు.

 

ఇక తన అత్తగారికి తను నటి కావాలని ఉండేదని... ఇప్పటికీ ఆమె నటిగా ట్రై చేయ్, నిన్ను వెండితెర మీద చూడాలని ఉంది అని చెబుతుంటారని సుష్మిత అన్నారు. ఏది ఏమైనా ఇపుడు నేను నాన్న, చరణ్ తో కలిసి సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుండటంపై వారు సంతోషంగా ఉన్నారని సుష్మిత తెలిపారు.

 

సుష్మితకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఇందులో ఆమె కోర్సు కూడా చేశారు. ఫ్యామిలీ సపోర్టు కూడా ఉండటంతో సుష్మిత దూసుకెలుతున్నారు. చిరంజీవి, చరణ్ సినిమాలు ఇప్పటి వరకు ఆమె అందించిన డిజైన్స్ ది బెస్ట్ గా ఉన్నాయనే ప్రశంసలు పొందారు.

 

గతంలో సుష్మిత తన తండ్రి ‘ఇంద్ర' సినిమా చేసినప్పుడే ఆమె ఈ రంగంలోకి కాస్ట్యూమ్ డిజైనర్ గా అడుగుపెట్టింది. అప్పటినుండి అందరివాడు, శంకర్ దాదా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుష్మిత తర్వాత పిల్లలు పుట్టడంతో గ్యాప్ తీసుకుని మళ్ళీ ఖైదీ నెంబర్ 150కి, తన తమ్ముడు చరణ్ చేసిన ధృవ సినిమాలకు పూర్తిస్థాయి కాస్ట్యూమ్ డిజైనర్ గా మారారు.

 

ఇక స్కూల్ డేస్ లో నేను, చరణ్ చదువులో బిలో యావరేజ్. అయితే శ్రీజ చదువులో టాపర్ గా ఉండేది. నాన్న చూస్తే కోప్పడతారు అనే భయంతో చెర్రీ, నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ దాచేవాళ్లం. చిన్న తనంలో నేను, చరణ్ బాగా కొట్టుకునేవాళ్లం. అయితే చరణ్ చదువుల నిమిత్తం మద్రాసు హాస్టల్ కొన్ని రోజులు మాకు దూరంగా ఉన్నాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ బాగా పెరిగింది అని సుష్మిత తెలిపారు.

 

2006 మార్చి2న వ్యాపారవేత్త విష్ణు ప్రసాద్ ను వివాహం చేసుకుంది సుష్మిత. విష్ణు వ్యాపారంలో రాణిస్తుండగా... సుష్మిత తనకు ఇష్టమైన కాస్ట్యూమ్స్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగంతోనే... సినిమాల్లో తన సత్తా చాటుతున్నారు.

loader