Asianet News TeluguAsianet News Telugu

ఇలా అవుతుందని అనుకోలేదు.. అంతా మనమంచికే : పొలిటికల్ ట్వీట్‌పై చిరంజీవి రియాక్షన్

రాజకీయాలపై కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన స్పందించారు. తన ట్వీట్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తుందని అనుకోలేదన్నారు. 

mega star chiranjeevi reaction on his political tweet
Author
First Published Sep 25, 2022, 5:14 PM IST

తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు మాత్రం తనను వదలడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో చిరు రాజకీయాలతో టచ్‌లో వున్నారంటూ టీవీల్లో కథనాలు, డిబేట్లతో రచ్చ రచ్చ చేశారు. ఈ నేపథ్యంలో గాడ్‌ఫాదర్ సినిమాలోని పొలిటికల్ డైలాగ్‌పై చిరంజీవి స్పందించారు. తన డైలాగ్ ఇంతగా ప్రకంపనలు సృష్టిస్తుందని అనుకోలేదన్నారు. అయినా ఇది ఒక రకంగా మంచిదేనంటూ చిరు వ్యాఖ్యానించారు. 

కాగా.. కొద్దిరోజుల క్రితం చిరంజీవి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ ఆడియో క్లిప్‌లో.. ‘‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’’ అని పేర్కొన్నారు. అయితే ఈ డైలాగ్ తన తాజా చిత్రం గాడ్‌ ఫాదర్‌కు సంబంధించింగా తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం చిరంజీవి నోటి వెంట ఈ విధమైన డైలాగ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ డైలాగ్‌కు సంబంధించిన ఆడియోను పోస్టు చేసిన చిరంజీవి.. గాడ్ ఫాదర్‌ చిత్రంలో తన లుక్‌ను మాత్రమే పోస్టర్‌లో ఉంచారు. ఇక, చిత్రానికి సంబంధించిన ఎలాంటి వివరాలను గానీ, ఏ విధమైన సందేశాన్ని కూడా అటాచ్ చేయలేదు.

Also REad:కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ.. మెగాస్టార్ చిరంజీవికి కొత్త ఐడీ కార్డ్

దీంతో ఆయన రాజకీయ ఎంట్రీపై మరోసారి అభిమానుల్లో తీవ్రమైన చర్చ మొదలైంది. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ.. పరోక్షంగా తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను మెగా అభిమానులు విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లో భాగమేనని ఫిల్మ్ నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఈ ట్వీట్ చేసిన తర్వాతి రోజే.. ఏఐసీసీ నుంచి చిరంజీవికి ఐడీ కార్డ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ.. 2027 వరకు ఐడీ కార్డ్‌కు కాలపరిమితి వుంటుందని తెలిపింది. దీని ద్వారా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో చిరంజీవి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఇకపోతే.. గతంలో ప్రజా రాజ్యం పార్టీతో రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఏపీ పునర్విభజన తర్వాత కొన్ని రోజుల పాటు రాజకీయాల్లో కనిపించారు. అయితే చాలా కాలంగా ఆయన యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే పలుమార్లు చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ వార్తలు వచ్చాయి.  కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సమయంలో కూడా చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై చర్చ సాగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios