Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ.. మెగాస్టార్ చిరంజీవికి కొత్త ఐడీ కార్డ్

మెగాస్టార్ చిరంజీవికి కొత్త ఐడీ కార్డ్‌ను జారీ చేసింది ఏఐసీసీ. పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ.. 2027 వరకు కాలపరిమితి వుంటుందని తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

aicc issued new id card for mega star chiranjeevi
Author
First Published Sep 21, 2022, 5:00 PM IST

మెగాస్టార్ చిరంజీవికి కొత్త ఐడీ కార్డ్‌ను జారీ చేసింది ఏఐసీసీ. పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ.. 2027 వరకు కాలపరిమితి వుంటుందని తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. నిన్న చిరంజీవి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ ఆడియో క్లిప్‌లో.. ‘‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’’ అని పేర్కొన్నారు. అయితే ఈ డైలాగ్ తన తాజా చిత్రం గాడ్‌ ఫాదర్‌కు సంబంధించింగా తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం చిరంజీవి నోటి వెంట ఈ విధమైన డైలాగ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ డైలాగ్‌కు సంబంధించిన ఆడియోను పోస్టు చేసిన చిరంజీవి.. గాడ్ ఫాదర్‌ చిత్రంలో తన లుక్‌ను మాత్రమే పోస్టర్‌లో ఉంచారు. ఇక, చిత్రానికి సంబంధించిన ఎలాంటి వివరాలను గానీ, ఏ విధమైన సందేశాన్ని కూడా అటాచ్ చేయలేదు.

ALso REad:రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు.. సంచలనం రేపుతున్న చిరంజీవి ట్వీట్

దీంతో ఆయన రాజకీయ ఎంట్రీపై మరోసారి అభిమానుల్లో తీవ్రమైన చర్చ మొదలైంది. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ.. పరోక్షంగా తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను మెగా అభిమానులు విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లో భాగమేనని ఫిల్మ్ నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. 

 

aicc issued new id card for mega star chiranjeevi

 

గతంలో ప్రజా రాజ్యం పార్టీతో రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఏపీ పునర్విభజన తర్వాత కొన్ని రోజుల పాటు రాజకీయాల్లో కనిపించారు. అయితే చాలా కాలంగా ఆయన యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే పలుమార్లు చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ వార్తలు వచ్చాయి.  కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సమయంలో కూడా చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై చర్చ సాగింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios