కళాతపస్వి కె.విశ్వనాథ్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుద‌నం వ‌చ్చిందన్న మెగాస్టార్ రేపు ఉదయం విశ్వనాథ్ ను కలవనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
కళాతపస్వీ కె. విశ్వనాథ్ కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కె విశ్వనాథ్ కు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మెగా కుటుంంబంతో విశ్వనాాథ్ కు అథ్యంత సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఆయనకు ఈ అవార్డు రావడం పట్ల చిరు కుటుంబసభ్టులు ఆనందం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు విశ్వనాథ్ గారితో ఉన్న అనుబంధం నటుడు, దర్శకుడని కాకుండా కుటంబ పరంగాను మంచి రిలేషన్ ఉంది. ఆయనకు ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతున్నా. అవార్డు రావాల్సిన సమయంలో వచ్చిందా? లేదా అన్న దానిపై ఇప్పుడు మాటలు అనవసరం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వరించాల్సింది. కానీ కాస్త ఆలస్యమైన అవార్డు ఆయన్ను వరించడం సంతోషంగా ఉంది. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు గానీ, మేము మాత్రం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. ఆయనకు అవార్డు రావడం తో ఆ అవార్డుకు నిండుదనం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా శుభాబివందనాలు తెలుపుతున్నా. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు కోరే మనిషినే..ఆయన చిరంజీవినే` అని అన్నారు.
