బాలయ్య-చరణ్ ఇద్దరిలో గెలుపెవరిదో!

First Published 22, May 2018, 1:08 PM IST
mega nandamuri war for sankranthi
Highlights

గత రెండేళ్లుగా సంక్రాంతి పోరులో మెగా-నందమూరి హీరోలు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు.

గత రెండేళ్లుగా సంక్రాంతి పోరులో మెగా-నందమూరి హీరోలు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. గతేడాది చిరంజీవి,బాలయ్య సినిమాలు సందడి చేయగా.. ఈ ఏడాది పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు తలపడ్డారు.వచ్చే ఏడాది కూడా మెగా-నందమూరి హీరోల మధ్య పోటీ తప్పేలా లేదు. ఈసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్యతో చరణ్ పోటీ పడబోతున్నాడని సమాచారం.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బాలయ్య.. బయోపిక్ రూపొందించనున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఇంకా కన్ఫర్మ్ కానప్పటికీ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక రామ్చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి బరిలో దింపాలని చూస్తున్నారు.

'ఎవడు' సినిమా తరువాత రామ్ చరణ్ ఇప్పటివరకు తన సినిమాలను సంక్రాంతికి విడుదల చేయలేదు. కానీ ఈసారి మాత్రం సంక్రాంతి ఫెస్టివల్ ను టార్గెట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. మరి సంక్రాంతి పోరులో ఇంకెన్ని సినిమాలు జాయిన్ అవుతాయో చూడాలి!
 

loader