టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలకుండే క్రేజ్ వేరే. మరి అందులోనూ మెగాస్టార్ కు సంబంధించిన విశేషం ఏదన్నా వుంటే... అభిమానులు దాని గురించి తెలుసుకునేందుకు ఎంతలా ఆరాటపడతారో. ప్రస్థుతం మెగాస్టార్ సైరా సినిమాలో నటిస్తున్నారు. రీసెంట్ గా సైరా మొదటి షెడ్యూల్ తో బిజీ బిజీగా గడిపిన మెగాస్టార్ చీరంజీవి బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా ఈ సారి కూడా సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాలనుకున్నారు.

 

చిరు ప్రతి ఏడాదిలా ఈ సారి కూడా సేమ్ ప్లాన్ ను అమలు పరుస్తున్నారట. ప్రతి ఏడాది చిరంజీవి సంక్రాంతికి బెంగుళూరు వెళుతుంటారు. మెగాస్టార్ ఫ్యామిలీ కూడా అక్కడికి అప్పుడపుడు వెళ్లి వస్తుంటారు. ఇక ఈ సారి మెగాస్టార్ కొంచెం ముందుగానే బెంగళూర్ లోని ఫార్మ్ హౌస్ కి వెళుతున్నారట. ఆయనతో పాటు ఫ్యామిలీ సభ్యులు కూడా అక్కడ కొన్ని రోజులు ఉండాలని ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకుంటారట.

 

ఇక సంక్రాంతి తరువాత చిరంజీవి సైరా సెకండ్ షెడ్యూల్ కోసం కేరళలోని పొల్లాచి వెళ్లనున్నారు. మార్చి మొదటి వారంలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. సైరా సినిమా పై మెగా స్టార్ చాలా నమ్మకంతో ఉన్నాడు. మెగా స్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా సైరా అవుతుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి స్టార్ నటులు సినిమాలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సైరా తెరకెక్కుతోంది.