మెగా హీరో వెర్సెస్ నందమూరి హీరో

మెగా హీరో వెర్సెస్  నందమూరి హీరో

ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. కొన్నికొన్ని సార్లు సినిమాల మధ్య పోటీ ఆసక్తిని కలిగిస్తుంది. ఈ పోటీ నేపధ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు విడుదలయ్యాయి. జనవరికి పోటీలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణల సినిమాలు విడుదల కానున్నాయి. ఇక రామ్ చరణ్ తన 'రంగస్థలం' సినిమాను మార్చి 30న సోలోగా విడుదల చేయాలనుకున్నాడు. 

కానీ 'మహానటి' సినిమా కూడా అదే సమయానికి వస్తుందని అన్నారు. అయితే ఇప్పుడు చిత్రనిర్మాతలు ఈ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. 'రంగస్థలం' సినిమాకు వారం రోజులు గ్యాప్ ఇచ్చి తమ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. 

దీంతో చరణ్ సినిమాకు అడ్డుగా మరే సినిమా లేదనుకుంటే ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తను నటిస్తోన్న 'ఎమ్మెల్యే' సినిమాను మార్చి 29న విడుదల చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. ఉపేంద్ర అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు 75% సినిమా షూటింగ్ పూర్తయింది. మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల అనంతరం సినిమాను మార్చి 29న విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే చరణ్ సినిమాకు ఒక్క రోజు ముందన్నమాట. దాదాపుగా ఇదే డేట్ ను లాక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

 

ఇది కూడా చదవండి

టాలివుడ్ బ్రేక్ ఫాస్ట్ టూకీలు 

బన్నీ వర్సెస్ రామ్ చరణ్

https://goo.gl/wefQuN

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos