మెగా కోడలు ఉపాసన ట్వీట్ తో సోషల్ మీడియాలో రచ్చ బ్రాహ్మణి తనకు మంచి స్నేహితురాలంటున్న ఉపాసన దీంతో షాక్ కు గురైన మెగా, నందమూరి అభిమానులు ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసిన ఫోటోతో రాజమౌళి రచ్చ

తెలుగు సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ వార్ కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా.. అనే పోటీ సాగుతూనే వుంది. ఈ పోటీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్లతోపాటు అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలు కూడా వార్ గ్రౌండ్ లో దిగుతున్నా.. మెయిన్ లీడ్ మాత్రం మెగా, నందమూరి ఫ్యామిలీలదే. దీనికి కారణం లేకపోలేదు. మాసెస్ లో మెగాఫ్యామిలీకున్న ఫాలోయింగ్ తర్వాత నందమూరి ఫ్యామిలీ హీరోలకే వుంది. దీంతో ఈ రెండు బ్రాండ్స్ మధ్యనే బాక్సాఫీస్ వార్ ఎక్కువ.

తాజాగా ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డుల జాబితాలో కూడా మెగా హీరో అల్లు అర్జున్ నటించిన సినిమాల గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. గతంలో మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీకి కూడా అదే తరహాలో నంది అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందనేది అప్పట్లో బాగానే వినిపించింది. ముఖ్యంగా నంది అవార్డుల్లో మెగా కుటుంబానికి అన్యాయం జరిగిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... మెగా కోడలు ఉపాసన, నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి ఇచ్చిన షాక్ హాట్ టాపిక్ గా మారింది.

నంది అవార్డుల రగడకు ఒక విధంగా నందమూరి బాలకృష్ణ కారణం అని మెగా అభిమానులు ఓ రేంజ్ లో మండి పడుతుంటే.. ఈ ఇద్దరు కుటుంబాలకు చెందిన బ్రాహ్మణి, ఉపాసనలు ఒకరికొకరు ఎంతో ఆప్యాయతతో మెలగడం విశేషంగా మారింది. వివరాల్లోకి వెళ్ళితే ఇద్దరూ కలిసి నిన్న ఒకేచోట రక్తదానం చేసారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలసి తీయించుకున్న ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరం చాలా మంచి స్నేహితులం అని చెపుతూ..ఉపాసన భలే ట్విస్చ్ ఇచ్చింది. తామిద్దరం ఆనందంగా సమయం గడిపామని చెప్తోంది.

టాప్ హీరోల మధ్య ఎట్టి పరిస్తితులలోను ఎటువంటి వైరుధ్యాలు ఉండవని కేవలం ఊహించుకుని టాప్ హీరోల అభిమానులే గాసిప్పులు సృష్టిస్తూ ఉంటారని లీకులు ఇస్తోంది ఉపాసన. ఇరు కుటుంబాల అభిమానులకు కూడ ఈ అంశం షాకింగ్ గా మారింది.

Scroll to load tweet…