ఓ రేంజ్ లో ఫ్యామిలీ పార్టీ... సాయిపల్లవి కుమ్మేసిందంతే...

mca family party song attracting middle class audience
Highlights

  • నాని, సాయిపల్లవి జంటగా వస్తోన్న ఎంసీఏ చిత్రం
  • మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రాన్ని సమర్పిస్తున్న దిల్ రాజు
  • తాజాగా రిలీజ్ చేసిన ఫ్యామిలీ సాంగ్ లో స్టెప్పులు ఇరగదీసిన సాయిపల్లవి

 

డబుల్ హ్యాట్రిక్ కోసం సిద్ధంగా వున్న నిర్మాత దిల్ రాజు, ఈ యేడాది మరో హిట్ అందుకునేందుకు రెడీగా వున్న నాని.. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసిన సాయిపల్లవి.. వీళ్లకు తోడుగా అందాల తార భూమిక రీ ఎంట్రీ ఇస్తున్న ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే వరంగల్ లో అశేష జనవాహిని హాజరై గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ ఇచ్చిన జోష్.. ఇలా ఫుల్ క్రేజీ టాక్ అందుకున్న నాని ఎంసీఏ చిత్రంలో సాయిపల్లవి-నానిల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూడటం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణమిది.

 

ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి మాత్రమే కాదని, మిడిల్ క్లాస్ ఆడియెన్స్ అని మరో డెఫినిషన్ చెప్పి.. మధ్య తరగతి ఫ్యామిలీలకు సినిమాపై మరింత ఇష్టం పెంచేలా చేశారు. తాజాగా ఫ్యామిలీ పార్టీ అంటూ మరో సాంగ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసి.. ఇది పక్కా కుటుంబ కథా చిత్రం అని స్పష్టం చేస్తున్నారు.

 

ఫ్యామిలీ పార్టీ.. అంటూ సాగే పాట.. భూమిక-రాజీవ్ కనకాల పెళ్లి నేపథ్యంలో జరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కలిసి జోష్ లో డ్యాన్స్ చేస్తున్న ఈ ట్రైలర్ ఇప్పటికే విశేషంగా ఆకట్టుకుంటోంది.

 

ఫిదా సినిమాలో 'వచ్చిండే.. మెల్ల మెల్లగా వచ్చిండే..' అంటూ తన స్టెప్పులతో ప్రేక్షకులను కట్టిపడేసిన సాయిపల్లవి.. తాజాగా విడుదలైన ఫ్యామిలీ పార్టీ సాంగ్ లోను తనదైన స్టెప్పులతో కుమ్మేసింది. ఫ్యామిలీ పార్టీ సాంగ్‌లో పెళ్లి చూపులు ప్రియదర్శి, నరేష్, ఇలా ఫ్యామిలీ అంతా కలిసి డ్యాన్స్ చేసి ఫ్యామిలీ పార్టీని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఇదంతా చూస్తే హిట్ పక్కా కాక మరేంటని అనిపిస్తోంది.

 

loader