Marco Movie OTT Release Date Announced: మలయాళ సంచలన మూవీ `మార్కో` ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
Marco Movie OTT Release Date Announced: గత సంవత్సరం విడుదలైన మలయాళ చిత్రాలలో `మార్కో` ఒకటి. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ టైటిల్ పాత్రలో నటించారు. ఈ చిత్రం మలయాళంలో అత్యంత హింసాత్మక చిత్రంగా పేరొందింది. డిసెంబర్ 20న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. కేరళాలోనే కాదు ఇది ఇతర భాషల్లో కూడా విడుదలై ఆకట్టుకుంది. మలయాళంలో సంచనాలు సృష్టించిన ఈ మూవీ ఇతర భాషల్లో ఆ స్థాయి ఆదరణ పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా OTT విడుదల తేదీని ప్రకటించింది టీమ్.
2024 డిసెంబర్ 20న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. మలయాళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదలైంది. విడుదలైన రోజే మలయాళ వెర్షన్ ప్రశంసలు అందుకుంది, హిందీ వెర్షన్ మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ రెండు భాషల్లోనూ చిత్రం మంచి ఆదరణ పొందిన తర్వాత, తెలుగు, తమిళ వెర్షన్లు కూడా విడుదలయ్యాయి. ఇటీవలే కన్నడ వెర్షన్ కూడా విడుదలైంది. అదే రోజు OTT విడుదల తేదీ ప్రకటించడం విశేషం.
సోనీ లివ్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ఈ చిత్రం ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా ఫిబ్రవరి 14 నుండి సోనీ లివ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. జనవరి 21న నిర్మాతలు వెల్లడించిన లెక్కల ప్రకారం, ఈ చిత్రం మొత్తం దాదాపు రూ.115 కోట్లకు పైగా వసూలు చేసింది. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిలిమ్స్ బ్యానర్లపై షరీఫ్ ముహమ్మద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
also read: విజయశాంతి పెళ్లి తర్వాత బాలకృష్ణతో సినిమాలు ఎందుకు తగ్గించింది? ఆమె భర్తనే ఆ పని చేశాడా?
