MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయశాంతి పెళ్లి తర్వాత బాలకృష్ణతో సినిమాలు ఎందుకు తగ్గించింది? ఆమె భర్తనే ఆ పని చేశాడా?

విజయశాంతి పెళ్లి తర్వాత బాలకృష్ణతో సినిమాలు ఎందుకు తగ్గించింది? ఆమె భర్తనే ఆ పని చేశాడా?

విజయశాంతి, బాలకృష్ణ అప్పట్లో హిట్‌ పెయిర్. కానీ పెళ్లి తర్వాత విజయశాంతి.. బాలయ్యతో మూవీస్‌ తగ్గించింది. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. అవేంటో చూస్తే ? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 31 2025, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌గా వెలిగారు విజయశాంతి. సాధారణ నటి నుంచి, స్టార్‌ హీరోయిన్‌గా, ఆ తర్వాత లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగి టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమని శాషించింది. శ్రీదే తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌తో రాణించింది విజయశాంతి.

చిరంజీవి, బాలకృష్ణ, నాగ్‌, వెంకటేష్‌ వంటి సూపర్‌ స్టార్స్ కి దీటుగా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. వారికి పోటీగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసి మెప్పించింది. స్టార్‌ హీరోలకు దీటుగా ఆమె సినిమాలు బాక్సాఫీసు వద్ద రచ్చ చేసేవాంటే అతిశయోక్తి కాదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

విజయశాంతి టాలీవుడ్‌లో ఎక్కువగా బాలకృష్ణతో కలిసి నటించింది. వీరి కాంబినేషన్‌ లో సుమారు 17 సినిమాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరేది. హిట్‌ పెయిర్‌గానూ నిలిచింది. ఈ జంట సినిమా చేస్తుందంటే హిట్‌ గ్యారంటీ అనే టాక్ ఉంది. మేకర్స్ అదే నమ్మేవారు. నిర్మాతలు కూడా వీరి కాంబినేషన్‌లోనే సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు.
 

35

అయితే `నిప్పురవ్వ` తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాత విజయశాంతి.. బాలయ్యతో సినిమాలు తగ్గించింది. దీనికి కారణం అప్పటికే తాను లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల వైపు టర్న్ తీసుకోవడమే అని, అలా బిజీ కావడంతో బాలయ్యతో సినిమాలు చేయలేకపోయానని ఆమె చెబుతుంది. పైగా పారితోషికం కోసం తాను లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసినట్టుగా తెలిపింది. 
 

45
Vijayashanthi

Vijayashanthi

కానీ దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి విజయశాంతి భర్త కావడం, రెండో ఈగో సమస్య కావడం. అప్పట్లో విజయశాంతికి కూడా హీరోలకు మించిన ఇమేజ్‌ ఉండేది. దీంతో సినిమా హిట్‌ అయితే ఎవరి వల్ల హిట్‌ అయ్యిందనే చర్చ నడిచేది.

విజయశాంతి వల్లే సినిమా హిట్‌ అయ్యిందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది హీరోలకు, ఆమెకి మధ్య ఈగో సమస్య తలెత్తింది. దీంతో సినిమాలు క్రమంగా తగ్గించిందని అంటుంటారు. చిరంజీవితోనూ తగ్గించడానికి ఇదే సమస్య అంటుంటారు. 

55

కానీ బిగ్గెస్ట్ హిట్‌ పెయిర్‌గా ఉన్న బాలయ్యతో మూవీస్‌ తగ్గించడానికి మరో కారణం విజయశాంతి భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌ కావడమే. ఆయన బాలకృష్ణకి బంధువు. అంతేకాదు బాలయ్య తాలూకు డేట్స్ అన్నీ ఆయనే చూసుకునేవారు. దీంతో తెరవెనుక స్టోరీస్‌ అన్నీ వాళ్లకి తెలుసు. ఈ క్రమంలోనే విజయశాంతితో కాంబినేషన్‌ సెట్‌ కాకపోవడానికి ఆయన ఓ కారణమయ్యాడని సీనియర్‌ జర్నలిస్ట్ ఇమంది రామారావు తెలిపారు.

ఆయనే కావాలని బాలకృష్ణ, విజయశాంతి పెయిర్‌ని తగ్గించారని ఆయన చెప్పారు. అదే సమయంలో బాలయ్యతో విజయశాంతికి ఈగో సమస్య వచ్చిందని, దీంతో అన్ని రకాలుగా ఇది కరెక్ట్ కాదని విజయశాంతి తగ్గించుకుందని అన్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.  

read  more: రజినీతో 1000 కోట్ల దర్శకుడి సినిమా, హీరోయిన్ గా రష్మిక.. మరో సూపర్‌ స్టార్‌ కూడా

also read: మొన్న వినాయక్‌, ఇప్పుడు నాగ్ అశ్విన్‌.. `విశ్వంభర`లో ఏం జరుగుతుంది? చిరంజీవి భయానికి కారణమదేనా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: వివాదానికి తాత్కాలికంగా తెర, పెద్దికి లైన్ క్లియర్.. 2 మీటింగులతో తెగ్గొట్టేసిన చిరంజీవి
Recommended image2
NTR Sentiment: ఎన్టీఆర్‌లో ఉన్న వింత సెంటిమెంట్స్ ఏంటో తెలుసా? ప్రతి రోజూ అవి కచ్చితంగా పాటించాల్సిందే
Recommended image3
Karuppu Box Office: సీఎం విజయ్ కి షాకిచ్చిన సూర్య, రికార్డులన్నీ లేచిపోతున్నాయ్.. కలెక్షన్ల సునామీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved