Prema Entha Madhuram: చక్కని కుటుంబ కథగా పేరు తెచ్చుకొని జీ తెలుగు ఛానల్ లో మంచి రేటింగ్ తో దూసుకుపోతూ ప్రేక్షకుల హృదయాలని కొల్లగొడుతున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం. ఇక ఈ రోజు మార్చి 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో మేమే ప్రోగ్రామ్ని ప్లాన్ చేసాము. మీరు రాక ముందు వరకు వాళ్ళిద్దరి మనసులో ఏదో తెలియని బాధ ఉండేది కానీ మీరు వచ్చిన తర్వాత పోయింది అని అంటాడు జనార్ధన్. లక్కీ టిప్ గెలిస్తే గిఫ్ట్ లు ఇవ్వాలి గాని ఫంక్షన్లు చేస్తున్నారు ఏ షాపింగ్ మాల్ మీది అని మాన్సీ అనగా కొత్తగా ట్రై చేయడాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం మేడం అని అంటాడు జనార్థన్.
కొత్తగా ట్రై చేయడమా లేకపోతే చిన్న కొడుకు కలపడానికి ట్రై చేయడమో నేను బయట పెడతాను అని మనసులో అనుకుంటుంది మాన్సీ. మరోవైపు శారదమ్మ వాళ్లకి ధన్యవాదాలు చెబుతూ మీరు ఈ ఫంక్షన్ చేసి మమ్మల్ని కలిపే పుణ్యం కట్టుకున్నారు అని అంటుంది. అప్పుడు జెండే విధి చాలా వింత వింత పనులు చేస్తుందమ్మా సరిగ్గా శుభకార్యానికే మనందరినీ కలిపింది అని అంటాడు. పద్దు, సుబ్బు గార్లు కూడా ఉంటే బాగుండు అని శారదమ్మ అనగా నేను వాళ్లకి ఫోన్ చేస్తాను వాళ్లు వస్తారు అని జెండే ఫోన్ చేస్తాడు.
మరోవైపు అంజలి, యాదగిరి తో మా అమ్మ ఈరోజు ఫంక్షన్ ఉందని చెప్పింది యాదగిరి కానీ నేను మర్చిపోయాను అని యాదగిరి చేత కార్ డ్రైవ్ చేస్తూ ఫంక్షన్ హాల్ వైపు బయలుదేరుతుంది. మరోవైపు శారదమ్మ,అనుతో కడుపుతో ఉన్నప్పుడు అష్టైశ్వర్యాలు మధ్య ఉండాల్సిన దానివి ఇలాగ ఉంటుంటే చూడలేకపోతున్నానమ్మ అని అంటుంది. అప్పుడు అను, ఆయన నాతో ఉన్నంతవరకు నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది.
సీతమ్మ వనవాసంలో ఉన్నప్పుడు రాముడు లేడు కానీ నా రాముడు నాతోనే ఉన్నాడు అని అంటుంది. ఇంతలో సుబ్బు పద్దులు అక్కడికి వస్తారు వాళ్ళను చూసి ఆనందపడుతుంది అను. కానీ పద్దు కోపంగా ఆర్య తో మీరు నా బంగారు తల్లిని తీసుకొని వెళ్ళిపోయారు అందుకనే నేను నీతో మాట్లాడను నీకు ఏమీ తెలీదు అను కోసమే స్వీట్లు అన్ని తెచ్చా అని అంటుంది. పక్కనే ఉన్న సుబ్బు దాని మాటలు పట్టించుకోవద్దు సార్ తల్లి ప్రేమ మాట్లాడిస్తున్న మాటలు అవి మీరు మా పాపని బానే చూసుకుంటారు అని తెలుసు.
కానీ తను దూరమైతే మాకు బాధగా ఉంటుంది కదా అని చెప్పి వెళ్లి అనుని ఆశీర్వదిస్తారు. మరోవైపు మాన్సీ బయటకు వెళ్లి ఎవరికో ఫోన్ చేస్తూ ఈ మధ్య నీరజ్ ఏమైనా డబ్బులు ఎవరికైనా ఇచ్చాడేమో చూడు అని చెప్తుంది. ఒకవేళ ఈ పని నువ్వే చేసేవని తెలిస్తే నీరజ్ నీకు ఉంటుంది అని మనసులో అనుకుని తిరిగి ఫంక్షన్ హాల్ వైపు వస్తుంది. అప్పుడు శారదమ్మ,మాన్సీ నువ్వు కూడా వచ్చి గాజులు తొడుగు అని అనగా నేను గొడ్రాలిని మామ్ ఇన్ లా నేను పిల్లలు కనలేని దానిని.
అదే కదా మీ అందరి దృష్టిలో నా మీద పడిన మచ్చ నేను గాజులు తొడగడానికి పనికి రాను అని అంటుంది. ఏ మంచి సమయాన్ని అయినా పాడు చేయడంలో ముందు ఉంటావు మాన్సీ అంటుంది శారదమ్మ. తను చెప్పిన దానిలో అబద్ధం ఏముంది మమ్మీ వదినని ఆశీర్వదించడానికి తనకి ఎటువంటి హక్కు లేదు నాకు కూడా ఏమాత్రం హక్కు లేదు నేనే తప్పు చేశాను నన్ను క్షమించండి దాదా నేను మీ మనసు బాధ పెట్టాను అని అంటాడు. మరోవైపు జెండే, అను దగ్గరకు వెళ్లి వర్ధన్ కుటుంబ వారసత్వాన్ని చూడడానికి చాలా ఆసక్తిగా ఉంది అంటాడు.
ఆర్య సార్ ధైర్యం బలం తెలివి మరియు నీ మంచితనం కలిపి పుట్టబోయే బిడ్డ బయటికి రావడానికి చాలా ఎదురు చూస్తున్నాను అని ఆశీర్వదిస్తాడు. మరోవైపు మాన్సీ కి ఫోన్ రాగా బయటకు వెళ్తుంది. మీ అనుమానం నిజమే మేడం నీరజ్ సార్ ఒక వ్యక్తికి డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే జనార్ధన్ మొన్న ఒకసారి ఆఫీస్ కి కూడా వచ్చాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ వ్యక్తి. ఆశ్చర్యం లో ఉన్న మాన్సీ ఇదంతా పక్కా ప్లాన్తో చేసిందా అని అనుకుంటుంది.
మరోవైపు అంజలి, యాదగిరి అదే ఫంక్షన్ హాల్ వైపు వస్తారు. ఇంతలో మాన్సీ మనసులో కిందటిసారి సీమంతం ఆగిపోయింది అందుకని ఈసారి పెట్టారు కదా. ఇది కూడా ఆగిపోతే ఏం చేస్తారు అని అనుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.
