Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ, కథనాలతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. భార్యాబిడ్డల బాగు కోసం తపన పడే ఒక మనసున్న భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో కాళ్ళకి కట్టు కట్టి నాకోసం ఎంత బాధనైనా భరిస్తారా అని అడుగుతుంది అను. నీకోసం మన బిడ్డ కోసం ఏమైనా చేస్తాను అంటాడు ఆర్య. నువ్వు తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతం అవుతాయి అంటూ దీవిస్తారు పంతులుగారు. మరోవైపు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడికి ఎవరు రాలేరు అంటూ ప్రీతికి కోపంగా ఫోన్ చేస్తుంది మాన్సీ.
వాళ్లు ఆల్రెడీ బయలుదేరిపోయారు అంటుంది ప్రీతి. అంతలోనే అక్కడికి ఇద్దరు ఆడవాళ్లు వస్తారు. ఆటో లేట్ అయింది మేడం అందుకే లేటుగా వచ్చాం అంటూ ఎక్స్ప్లనేషన్ ఇస్తారు వాళ్ళు. సరే కానీ నేను చెప్పింది జాగ్రత్తగా వినండి కాసేపట్లో మా బావగారు అగ్నిగుండం తొక్కుతారు కార్యక్రమం జరగకుండా చూడండి.
ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడండి అంటుంది మాన్సీ. ఇదంతా నాకు అలవాటే ఆ మనిషి ఎవరో చూపించండి చాలు అంటారు వాళ్లు. ప్రీతి ఇచ్చిన లిక్విడ్ ఏది అని అడుగుతుంది మాన్సీ. బ్యాగ్ లోంచి లిక్విడ్ తీసి ఇచ్చి ఇది దేనికి మేడం అని అడుగుతారు వాళ్ళు తర్వాత చెప్తాను ముందు మీ పని కానివ్వండి అంటుంది మాన్సీ.
మీరు కాలు నొప్పితో ఉన్నారు. మళ్ళీ నిప్పుల గుండం ఎలా తొక్కుతారు అంటాడు నీరజ్. ఎలాగైనా ఈ మొక్కు తీర్చేయాలి అను విషయంలో కానీ పుట్టబోయే బిడ్డ విషయంలో కానీ ఎలాంటి ఛాన్స్ తీసుకోను అంటాడు ఆర్య. నేను నిప్పుల గుండం తొక్కుతానంటే హా నువ్వు చూడలేదు అడ్డుకుంటుంది ఏదో కారణం చెప్పి అను ని అక్కడికి రానికుండా చూడు అని శారదమ్మకి చెప్తాడు ఆర్య.
సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారదమ్మ. అను దగ్గరికి వెళ్లి పద్దు గారు ప్రసాదం పంచుతారు మనిద్దరం ఇక్కడే ఉన్నాము అంటుంది శారదమ్మ.నేను కూడా వస్తాను అంటుంది అను. వద్దు అక్కడ నువ్వు ఇబ్బంది పడతావు అంటుంది శారదమ్మ. ఏమీ అనలేక అక్కడే ఉండిపోతుంది అను. మరోవైపు భార్య కాళ్లు కడుక్కునే నీటిలో లిక్విడ్ కలుపుతుంది మాన్సీ.
వీటితో కాళ్లు కడుక్కొని నిప్పుల గుండం తప్పితే కాళ్లు బగ్గుమంటాయి అంటూ కసిగా నవ్వుకుంటుంది. ప్రీతి పంపించినావిడ ఆ చెంబు ని ఆర్య కి ఇచ్చి నిప్పుల గుండం తొక్కేముందు కోనేటి నీటితో కాళ్లు కడుక్కోవాలి అంటూ లిక్విడ్ కలిపిన నీటిని ఇస్తుంది. నీరజ్ ఆ నీళ్లతో ఆర్య కి కాళ్లు కడుగుతాడు. దారిలో ఉన్న నీళ్ళ బిందని చూసుకోకుండా తన్నేస్తాడు.
ఆ నీళ్లు ఆర్య కాళ్ళ మీద పడి లిక్విడ్ మొత్తం కొట్టుకుపోతుంది. అది చూసి కోపంతో రగిలిపోతుంది మాన్సీ. కాలి నొప్పితోనే అగ్నిగుండం తొక్కడం పూర్తి చేస్తాడు ఆర్య. మరోవైపు అను దగ్గరికి వచ్చిన ఒక భక్తురాలు నువ్వు ఎంత అదృష్టవంతురాలివి నీకోసం నీ భర్త నిప్పుల గుండం తొక్కుతున్నాడు అని చెప్తుంది.
విషయం తెలియని అను నిజమా అంటూ ఆర్య దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి ఏంటి సర్ ఇదంతా మీరు నిప్పుల్లో నడవటానికి వీల్లేదు అంటూ అడ్డుపడుతుంది. మీరు నా కోసం ఎంత కష్టాన్ని భరించవలసిన అవసరం లేదు. నేను ఇదంతా చూడలేను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. మనకోసం చేస్తున్నది ఇబ్బంది ఎందుకు అవుతుంది తప్పుకో అంటాడు ఆర్య.
ఈ మొక్కుబడి నా కోసమే కదా అవసరమైతే నేనే ఈ నిప్పుల గుండం తొక్కుతాను అంటుంది అను. కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు అంటుంది శారదమ్మ. నాకు ఏమీ కాకుండా అమ్మే కాపాడుతుంది. ఎంత కష్టమైనా నేను భరిస్తాను కానీ కాలికి గాయంతో సర్ నిప్పుల గుండం తొక్కితే నేను భరించలేను అంటుంది అను. మొక్కుబడి మధ్యలో ఆపకూడదు నీకోసం కాకపోయినా పుట్టే బిడ్డ కోసమైనా ఆలోచించు సార్ ని ఆపొద్దు అంటుంది పద్దు.
నాకు నా కన్నా నా బిడ్డ కన్నా ఆర్య సారే ముఖ్యం. నాకోసం నా బిడ్డ కోసం సార్ అంత భరించినప్పుడు నేను మాత్రం నిప్పులు తొక్క లేనా అంటూ ఆమె కూడా నిప్పుల గుండం తొక్కబోతుంది అను. అనుని తన చేతులతో ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కి తన మొక్కిని చెల్లిస్తాడు ఆర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.
