Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి స్టోరీ తో అందరి హృదయాలని దోచుకుంటుంది. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే ఒక వ్యక్తి కథ సీరియల్. ఇక ఈరోజు మార్చి 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో వర్కర్స్ కోసం ఆనంద్ ఎంత చేశాడో నాకు తెలుసు. అన్ని ఫెసిలిటీస్ వుండాలని పోరాటం చేశాడు. అలాంటి వ్యక్తి మీద నిందలు వేసి గెంటేశారు అంటుంది అంజలి. వాళ్లు చేసిన తప్పేంటో, ఎవరిని గేంటేసి పొరపాటు చేశారో తెలుసుకుని పశ్చాతాపడే రోజు వస్తుంది మనం జరగవలసిన పని చేద్దాం నేను ఆల్రెడీ మా లాయర్ కి ఫోన్ చేశాను వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం అంటాడు నీరజ్.
థాంక్యూ, అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు ఇసుకలో కల్తీ ఎలా జరిగిందో తెలియటం లేదు అంటూ కంగారుపడుతుంది అంజలి. ఆమెకి ధైరం చెబుతాడు నీరజ్. మరోవైపు బిల్డింగు కూలగొడుతున్న ఆఫీసర్ దగ్గరికి వచ్చి మీరు బిల్డింగ్ సీజ్ చేశారు ఓకే కానీ మేము ఎక్స్ప్లనేషన్ ఇవ్వకుండానే ఎందుకు బిల్డింగ్ కూలగొడుతున్నారు అని అడుగుతుంది అంజలి.
మీరు గవర్నమెంట్ ప్లేస్ ని ఎక్స్టెండ్ చేసి ఈ బిల్డింగ్ ని కట్టారు ఈ ప్లేస్ లో గవర్నమెంట్ సర్వీసింగ్ సెంటర్స్ కట్టమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి అందుకే మీ బిల్డింగ్ ని కూలగొడుతున్నాము అంటాడు ఆఫీసర్. దిస్ ఇస్ రూట్ లెస్ అంటూ ఆవేశంగా అరుస్తుంది అంజలి. ఇప్పుడు ఫ్రెష్టేట్ అయి ఏం లాభం నేను చెప్పినట్లుగా ప్రాజెక్ట్ ని రన్ చేసి ఉంటే బాగుండేది అంటుంది మాన్సీ.
ఇందులో తన తప్పేముంది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అంటాడు నీరజ్. ఇంకా సపోర్ట్ చేయకు, ఈ కాన్ఫిడెన్స్ వల్లే మన కంపెనీ పెద్ద లాస్ ని ఫేస్ చేయబోతుంది అంటుంది మాన్సీ. నేను లూజర్ ని నా వల్లే ఇదంతా జరిగింది. ఈ కంపెనీకి జరిగిన నష్టాన్ని నేను భరిస్తాను అంటుంది. టెన్షన్ పడొద్దు ప్రాబ్లం ని అందరినీ కలిసి ఫేస్ చేద్దాం అంటాడు నీరజ్.
ఇంకా ఏం మిగిలింది రెండు గంటల్లో నేను కష్టపడిన ప్రాజెక్టు నేలకూలబోతుంది. నేను ఇండియాలోనే ఉండను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంజలి. తన వెనకే వెళ్తాడు నీరజ్. మాన్సీ మేడం పెద్ద ఖతర్నాక్ అనుకున్నదంతా చేసింది అనుకుంటాడు యాదగిరి. అను దగ్గరికి వెళ్లి నా గెలుపుని తన ఓటమిని గుర్తు చేయాలి అనుకుంటుంది మాన్సీ.
మరొకవైపు పొద్దుట నుంచి ఏమి తినలేదని గమనించిన ఒక టీ కొట్టావిడ అనుకి బన్ పంపిస్తుంది. బన్ తింటున్న అనుకి పేపర్లో అంజలి బిల్డింగ్స్ కూల్చి వేస్తున్నట్లు చూసి ఆర్య కి చూపిస్తుంది. ఆర్య టీ కొట్టావిడకి అనుని అప్పగించి అక్కడి నుంచి అర్జెంటుగా అంజలి దగ్గరికి వెళ్తాడు. అంతలోనే అక్కడికి మాన్సీ వస్తుంది. ఈమధ్య నేను ఏది అనుకుంటే అది జరిగిపోతుంది.
కాసేపట్లో గవర్నమెంట్ ఆ బిల్డింగ్ ని కూల్చేయబోతుంది తెలుసా అని అంటుంది. కొన్నిసార్లు మనకి అనుకూలంగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అదేది నిజం కాదు అంటుంది అను. నిజమా నిన్ను ఫుట్ పాత్ మీదకి తీసుకు వస్తాను అన్నాను కదా జరిగింది చూశావా, అలాగే ఆ బిల్డింగ్ కూడా కూలిపోతుంది చూస్తూ ఉండు అంటుంది మాన్సీ. ఆర్య సర్ ఎప్పుడూ మధ్యలో పని వదిలేయరు, పని పూర్తి చేయడానికి వెళ్లారు అంటుంది అను. కంగారుగా అక్కడ నుంచి వెళ్తుంది మాన్సీ.
మరోవైపు అవమాన భారంతో ఉన్న అంజలి సిటీ వదిలి వెళ్ళిపోతాను అంటూ నీరజ్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. అంతలోనే అక్కడికి వచ్చిన ఆర్య ఏం జరిగింది అంటూ నీరజ్ ని అడుగుతాడు. జరిగిందంతా చెప్పి అంజలి బాగా డిస్టర్బ్ అయింది సిటీ వదిలి వెళ్ళిపోతుందట అని చెప్తాడు నీరజ్. సరే ముందు కార్ తీయు అంటూ అంజలి కార్ ని ఫాలో అవుతారు. ఆమె కారుకి అడ్డు వెళ్లి ఆ కారుని ఆపుతారు.
ఆర్య ని చూసిన అంజలి కారు దిగి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ప్రాజెక్టు స్టార్ట్ చేశాను కదా అంటుంది. మీరెందుకు ఓటమిని ఒప్పుకొని ఫారిన్ కి వెళ్ళిపోతున్నారు అంటాడు ఆర్య. ఏం చేసేది నేను పూర్తిగా ఓడిపోయాను నాతో పాటు ఆర్య వర్ధన్ కంపెనీస్ ని కూడా నష్టాలపాలు చేశాను అంటుంది అంజలి. మీ ఓటమిని మీరే ఒప్పుకుంటే అంతకు మించిన ఓటమి మరొకటి ఉండదు అంటాడు ఆర్య.
ఏం చేయమంటావు మనం ఇన్నాళ్ళు కష్టపడిన కన్స్ట్రక్షన్ ని కూల్చేయటానికి అంతా సిద్ధం చేస్తున్నారు అంటుంది అంజలి. ఇంకా కూల్చేయ్యలేదు కదా స్టిల్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ అవర్ హాండ్స్ అంటాడు ఆర్య. ఇంకా ఏ నమ్మకంతో అంటున్నావు అంజలి. నిజాయితీగా పని చేసినప్పుడు ఆ నిజాయితీయే మనల్ని గెలిపిస్తుంది.మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫేస్ చేసాము అలాగే దీన్ని కూడా ఫేస్ చేద్దాం.
మీ డాడీ తో చాలెంజ్ చేసి ఇక్కడికి వచ్చారు ఫస్ట్ ప్రాజెక్ట్ లోనే డేరింగ్ డెసిషన్స్ తీసుకున్నారు అలాంటిది మీ ధైర్యం ఇప్పుడు ఏమైంది. మీరు అమెరికాకి లూసర్ గా కాదు విజయాన్ని మోసుకొని వెళ్తారు అంటాడు ఆర్య. ఆ మాటలకి ఇన్స్పైర్ అయిన అంజలి నేను పోరాటం చేస్తాను వెనుకడుగు వేయను అంటుంది. గుడ్ అంటూ అంజలిని సైట్ దగ్గరికి తీసుకువెళ్ళు అని నీరజ్ కి చెప్పి బిల్డింగు కూల్చకుండా నా ప్రయత్నం నేను చేయడానికి వెళ్తాను అంటాడు ఆర్య.
తన కారులో వెళ్ళమంటుంది అంజలి. నీరజ్ వాళ్ళు సైట్ దగ్గరికి వెళ్తారు. మరోవైపు బిల్డింగు కూల్చటానికి ఇంకా ఎంత టైం పడుతుంది ఆల్రెడీ ఈ బిల్డింగ్ ని సేవ్ చేయడానికి మా బ్రో ఇన్ లా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు అంటుంది మాన్సీ. ప్రోక్లైన్స్ వస్తున్నాయి మేడం అవి వస్తే బిల్డింగు కూల్చేయడమే అంటారు ఆఫీసర్. అంతలో నీరజ్ వాళ్ళు రావడం చూసి కంగారుపడుతుంది మాన్సీ.
అంజలి ఫేసులో ఏదో కాన్ఫిడెన్స్ కనబడుతుంది అనుకుంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆఫీసర్స్ ని ఎంత రిక్వెస్ట్ చేసినా నా మాట వినట్లేదు ఒక్కదాన్నే ఎంతని మేనేజ్ చేస్తాను అంటుంది మాన్సీ. నువ్వు టెన్షన్ పడకు మన ప్రాజెక్ట్ సేఫ్ బికాజ్ ఆనంద్ ఈజ్ బ్యాక్, హి ఇస్ ఆన్ డ్యూటీ అంటుంది అంజలి. ఇంకో పావుగంటలో బిల్డింగు కూలిపోతుంది ఏదైనా గొడవ చేయాలి అనుకుంటే మానుకోండి అంటాడు ఆఫీసర్.
మేమేమీ గొడవ చేయము మీరే నష్టపరిహారం కట్టి మరీ ఇక్కడి నుంచి వెళ్తారు అంటాడు నీరజ్. వాట్ నాన్సెన్స్ అంటాడు ఆఫీసర్. పదిహేనునిమిషాలు ఆగితే మీరు చేసిన నాన్సెన్స్ ఏంటో మీకే అర్థమవుతుంది అంటాడు నీరజ్. మీరు ఇచ్చిన టైం అయిపోయింది బిల్డింగ్ కూల్చేయండి అంటాడు ఆఫీసర్. అంతలోనే అక్కడికి ఓ గవర్నమెంట్ కార్ వస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.
