బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా క్వీన్ దక్షిణాది భాషల్లో క్వీన్ రీమేక్ కు సన్నాహాలు తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్ మళయాల క్వీన్ గా మంజిమా మోహన్
బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన క్వీన్ సినిమా ప్రాంతీయ భాషల్లో రీమేక్ కానుంది. ఇప్పటికే క్వీన్ చిత్రంపై చాలా ఆసక్తి పెరిగింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో సమాచారం అందుతోంది. తెలుగులో క్వీన్ రీమేక్ లో తమన్నా నటిస్తుండగా.. తమిళంతో కాజల్ అగర్వాల్ ఈ మూవీ చేసేందుకు అంగీకరించింది. ఇక మళయాల వెర్షన్ లో ఈ చిత్రం రీమేక్ లో మంజిమా మోహన్ హిరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.
నాగ చైతన్యతో సాహసం స్వాసగా సాగిపో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మంజిమా మోహన్ క్వీన్ రీమేక్ లో చేయడం విశేషమే.
ఈ చిత్రాన్ని రొటీన్ కి భిన్నంగా.. కొత్త తరహాలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మళయాల భాషల్లో టాలీవుడ్ దర్శకుడు నీలకంఠ ఒక్కడే తెరకెక్కించనున్నాడు. మరో రెండు మూడు నెలల్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
