సాహో టీమ్ లో మరో బాలీవుడ్ బ్యూటీ ఇప్పటికే బాలీవుడ్ నుంచి భారీగా స్టార్ కాస్ట్ హీరోయిన్ గా శ్రద్ధాకపూర్ ను తీసుకున్న సాహో టీమ్ తాజాగా మరో బాలీవుడ్ లేడీని డంప్ చేసిన యూనిట్
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో బాలీవుడ్ ఫ్లేవర్ ఎక్కువగా వుండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్ధాకపూర్ ను ఎంపిక చేసిన సాహో టీమ్ తాజాగా మరో కీల పాత్ర కోసం ఓ ప్రౌఢ ఆంటీని బాలీవుడ్ నుంచే దిగుమతి చేస్తోంది.
సాహో కాస్ట్ లో చేరనున్న ఆ బాలీవుడ్ బ్యూటీయే మందిరా బేడీ. మందీరా అంటే తెలియని వారుండరు. 1994వ సంవత్సరంలో దూరదర్శన్‌లో ప్రసారమయిన శాంతి సీరియల్‌లో టైటిల్ రోల్లోనటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మందిరా బేడీ దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సాదించుకుంది. ఆ తర్వాత చాలా కాలం క్రికెట్ వ్యాఖ్యాతగానూ వ్యవహరించి దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటీవల పెద్దగా కనిపించని మందీరా అంతా మర్చిపోతున్న సమయంలో మళ్ళీ హాట్ న్యూస్ క్రియేట్ చేసింది.

ప్రభాస్ సాహోలో మందిరా కూడా కనిపించనుందంటూ ఒక్కసారి ఈ ప్రౌఢ లేడీ గురించి మళ్ళీ మీడియా అంతా వార్తల్లోకెక్కించింది. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ మూడు భాషలతో పాటు మళయాళం, కన్నడలోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఓ ప్రాంతీయ చిత్రంలా కాకుండా... జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నటీనటుల్ని కూడా బాలీవుడ్ నుంచే ఎక్కువగా తీసుకుంటున్నారు.
బాహుబలితో నార్త్ లోనూ స్టార్ ఇమేజ్ సాధించిన ప్రభాస్, తన నెక్ట్స్ సినిమాతో అక్కడ మరింతగా పాతుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు ఎక్కువగా నార్త్ ఫ్లేవర్ యాడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్దా కపూర్ ను ఫైనల్ చేసిన సాహో యూనిట్, ప్రతి నాయకులుగా బాలీవుడ్ స్టార్స్ నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండేలను తీసుకున్నారు.
సాంకేతిక నిపుణులను కూడా బాలీవుడ్ నుంచే దిగుమతి చేసుకుంటున్నారు సాహో టీం. సంగీత దర్శకులుగా శంకర్ ఎసాన్ లాయ్ లను ఎంపిక చేశారు. తాజాగా సాహో సెట్ లోకి మరో బాలీవుడ్ తార ఎంటర్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో అలరించే బాలీవుడ్ భామ మందిర బేడీ సాహో లో కీలక పాత్రలో నటించనుందట. అది కూడా నెగిటివ్ రోల్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ సినిమాల కనిపిస్తున్న సాహో లో ఇంకెంత మంది ఉత్తరాది తారలు కనిపించనున్నారో.
