Asianet News TeluguAsianet News Telugu

'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విష్ణు.. తొలి సంతకం ఆ ఫైలు పైనే..

కనీసం 'మా' ఎన్నికల తర్వాత అయినా టాలీవుడ్ లో హీట్ తగ్గుతుందని భావించారు. ఆ వేడి అలాగే కొనసాగుతోంది. వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా 'మా' ఎన్నికల్లో విష్ణు విజయం సాధించాడు.

Manchu Vishnu takes charge as MAA President
Author
Hyderabad, First Published Oct 13, 2021, 12:51 PM IST

కనీసం 'మా' ఎన్నికల తర్వాత అయినా టాలీవుడ్ లో హీట్ తగ్గుతుందని భావించారు. ఆ వేడి అలాగే కొనసాగుతోంది. వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా 'మా' ఎన్నికల్లో విష్ణు విజయం సాధించాడు. 'మా'కి అతడే కొత్త అధ్యక్షుడు. యువకుడైన విష్ణు 'మా'ని ఎలా నడిపిస్తాడు.. ప్రస్తుతం ఉన్న వివాదాలని ఎలా అధికమిస్తాడు అనే ఉత్కంఠ నెలకొని ఉంది. 

ఈ పరిస్థితుల మధ్య Manchu Vishnu కొద్దిసేపటి క్రితమే 'మా' ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించాడు. తొలి సారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న విష్ణుని ఇతర సభ్యులు.అతడి ప్యానల్ మెంబర్స్ సన్మానించారు. దీనితో విష్ణు అధ్యక్ష స్థానంలో కూర్చున్నాడు. 

మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక విష్ణు ఆర్టిస్టుల పెన్షన్స్ ఫైల్ పై తొలి సంతకం చేసినట్లు తెలుస్తోంది. తాను బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని విష్ణు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. 'నేను ఈ రోజు మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను. మీ అందరి ఆశీస్సులు, పాజిటివిటి కావాలి' అని ట్వీట్ చేశాడు. 

గత రెండు నెలలుగా మా ఎన్నికల విషయంలో చోటు చేసుకున్న సంఘటనలు..Prakash Raj.. విష్ణు ప్యానల్ మధ్య పరస్పర విమర్శలు అంతా గమనించారు. ఎన్నికల పోలింగ్ రోజున కూడా ప్రశాంత పరిస్థితులు కనిపించలేదు. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో చివరకు విష్ణు విజయం సాధించాడు. 

తాను తెలుగు వాడిని కాదనే కారణంతోనే సభ్యులు ఎన్నికల్లో తనని రిజెక్ట్ చేశారని ప్రకాష్ రాజ్ మనస్తాపానికి గురయ్యారు. దీనితో ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్త ముదురుతోంది. 

Also Read: నరేష్‌ని చాణక్యుడితో పోల్చిన సమీర్‌.. ఆయన ఉంటే పనులు జరగవు.. మాకు సెట్‌ కాదంటోన్న శ్రీకాంత్‌..

ప్రకాష్ రాజ్ బాటలోనే అతడి ప్యానల్ సభ్యులు కూడా నటుస్తున్నారు. తనీష్, బెనర్జీ లాంటి వారు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. Mohan Babu తమని తీవ్రమైన బూతులతో దూషించారని వీరు మీడియా ముందు ఆరోపిస్తునే సంగతి తెలిసిందే. అలాగే నరేష్ కూడా అసభ్య పదజాలం ఉపయోగించారని ఉత్తేజ్ సంచలన  వ్యాఖ్యలు చేశారు. దీనితో మా ఎన్నికల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. 

Also Read: రాధికా ఆప్టే బోల్డ్ షో.. బిగుతైన ఎద అందాలతో మామూలు రచ్చ కాదుగా!

మంచు విష్ణు ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై 107 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మా ఎన్నికలు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మెగా ఫ్యామిలీ వెర్సస్ మంచు ఫ్యామిలీ అన్నట్లుగా సాగాయి. తనని మా ఎన్నికల నుంచి విత్ డ్రా అవ్వమని స్వయంగా చిరంజీవి చెప్పినట్లు విష్ణు మీడియా సమావేశంలో వివరించారు. 

 

మంచు విష్ణుకి ఇండస్ట్రీలో పెద్దల సపోర్ట్ లభించిందనే వాదన ఉంది. ఇక ఎన్నికల రోజు మంచు విష్ణు కోసం జెనీలియా స్వయంగా ముంబై నుంచి వచ్చి ఓటు వేసింది. దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు..మంచు విష్ణు తెర వెనుక భారీ కసరత్తే చేశారని. ఇక విష్ణు కోసం నటుడు నరేష్ కూడా దాదాపు 800 మంది సభ్యులకు స్వయంగా ఫోన్స్ చేశాడని మోహన్ బాబు ప్రశంసించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios