టాలీవుడ్ టాలెస్ట్ హీరో మంచు విష్ణు దొంగతనం చేశారు. అది కూడా న్యూజిలాండ్ లో.. ఇంతకీ ఆయన ఆ పని ఎందుకు చేశారు..? ఎవరికోసం చేశారు...? అసలేంటి మ్యాటరు. 


ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు మంచు విష్ణు. కన్నప్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ అడవుల్లో శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్డెజ్ తో.. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈసినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సౌత్, నార్త్ కాంబినేషన్ లో బడా బడా స్టార్స్ నటిస్తున్నారు. అందులో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్. మొహన్ బాబు. ఇలా స్టార్ క్యాస్ట్ నటించబోతుంది. 

ఇక ఈసినిమా షూటింగ్ స్టార్ట్ న్యూజిలాండ్ లోనే స్టార్ట్ చేశారు.. అక్కడే సింగల్ షెడ్యూల్ తో ఈ మూవీని న్యూజిలాండ్ లోనే పూర్తి చేయనున్నారు. దీంతో మూవీ కావాల్సిన సెట్ ప్రోపర్టీ, ఆర్టిస్ట్ లు అందరూ న్యూజిలాండ్ లో మకాం వేసి.. సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక మంచు విష్ణుతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా ప్రస్తుతం న్యూజిలాండ్ లోనే ఉన్నారు. విష్ణు సతీమణి విరానికా రెడ్డి కూడా న్యూజిలాండ్ లో విష్ణుకు షూటింగ్ లో సాయం చేస్తూ ఉన్నారు. 

View post on Instagram

ఈక్రమంలో రీసెంట్ గా విరానికా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఒక వీడియో పోస్ట్ చేసిన ఆమె.. ఈ విధంగా రాసుకొచ్చారు. న్యూజిలాండ్ లో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన నాకు ఇష్టమైన హైడ్రేంజ పూలు కనిపించాయి. దీంతో విష్ణు కారు ఆపి నాకోసం వాటిని కోసుకు వచ్చారు. అయితే ఇక్కడ రూల్స్ ప్రకారం ఎక్కడ పడితే అక్కడ పూలు కోయకూడదు అని చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో విష్ణు.. నా ప్రేమ కోసం తనకి ఇష్టమైన పూలు తీసుకు రావడానికి వెళ్తున్నాను అంటూ చెప్పారు. 

Pooja Hegde : చంపేస్తాం అంటూ పూజా హెగ్డేకు బెదిరింపు కాల్స్...? క్లారిటీ ఇచ్చిన బ్యూటీ.

న్యూజిలాండ్‌లో అలా ఎక్కడ పడితే అక్కడ పూలు కోస్తే కఠినంగా శిక్షిస్తారట. అయినా మంచు విష్ణు తన భార్య కోసం ఇలా న్యూజిలాండ్‌ రూల్స్ బ్రేక్ చేశారు. అయితే నెటిజన్లు మాత్రం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దొంగతనం ఎలాగో చేశారు.. అది సోషల్ మీడియాలో మీరే ప్రచారం చేసుకుంటున్నారా..? ఈ వీడియోను న్యూజిలాండ్‌ పోలీసులు చూడకుండా ఉండాలని కోరుకోండి అంటూ సలహాలు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.