Maa Elections: సొంత ఖర్చుతో ‘‘మా’’ భవనం .. సభ్యుల పిల్లల పెళ్లికి 1.16 లక్షల సాయం: మంచు విష్ణు మేనిఫెస్టో

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల (maa elections) నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు (manchu vishnu) తన మేనిఫెస్టోను (manifesto)  ప్రకటించారు. సొంత డబ్బుతో మా భవనం (maa building) నిర్మిస్తామని.. భవిష్యత్ అవసరాలు తీర్చేలా భవనాన్ని నిర్మిస్తామని విష్ణు తెలిపారు

manchu vishnu manifesto in maa elections

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల (maa elections) నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు (manchu vishnu) తన మేనిఫెస్టోను (manifesto)  ప్రకటించారు. సొంత డబ్బుతో మా భవనం (maa building) నిర్మిస్తామని.. భవిష్యత్ అవసరాలు తీర్చేలా భవనాన్ని నిర్మిస్తామని విష్ణు తెలిపారు. మా సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ (health insurance)ఏర్పాటు చేస్తామన్నారు. మా భవనం కోసం మూడు స్థలాలను పరిశీలించామని విష్ణు వెల్లడించారు. త్వరలోనే ‘‘మా’’ యాప్ (maa app) రెడీ చేస్తామని ఆయన ప్రకటించారు. మా సభ్యులకు ఈఎస్ఐ, (esi) హెల్త్ కార్డులు (health card) ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

Also Read:MAA elections: ఏం చేశారని ప్రకాశ్‌రాజ్‌కు సన్మానం.. ఏపీ ‘‘మా’’ ప్రతినిధులకు థర్టీఇయర్స్ పృథ్వీ వార్నింగ్

మా సభ్యుల పిల్లలకు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తామని విష్ణు హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకోసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని విష్ణు ప్రకటించారు. అర్హులైన సభ్యులకు పెన్షన్లు (pensions) ఇస్తామని ఆయన తెలిపారు. నటులకు అవకాశాల కోసం మా యాప్ సిద్ధం చేసి.. మా సభ్యుల జాబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని విష్ణు చెప్పారు. నిరుద్యోగ కళాకారుల పిల్లలకు ఉపాధిని కల్పించి.. సినీ పరిశ్రమలోని యువతకు ప్రోత్సాహం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. మహిళల రక్షణకు హైపవర్ ఉమెన్స్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని విష్ణు ప్రకటించారు. మా సభ్యత్వ రుసుమును (maa membership fee) లక్ష నుంచి రూ.75 వేలకు తగ్గిస్తామని ఆయన తెలిపారు. అర్హులైన సభ్యుల పిల్లల పెళ్లి ఖర్చులకు రూ.1.16 లక్షల ఆర్ధిక సాయం చేస్తామని విష్ణు ప్రకటించారు. 

గౌరవ సభ్యుత్వం ఇచ్చిన సీనియర్‌ సిటిజన్స్‌కు ఓటు హక్కు వచ్చేలా ఏజీఎంలో ఆమోదిస్తామని.. ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాన్ని చురుగ్గా చేపట్టడానికి ఒక కల్చరల్‌ అండ్‌ ఫైనాన్స్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని విష్ణు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చలన చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. ‘మా’ సభ్యుల పిల్లలకు  ‘మోహన్‌బాబు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌’ ద్వారా 50 శాతం స్కాలర్‌షిప్‌తో శిక్షణ ఇప్పించి కళాకారులుగా తీర్చిదిద్దుతామని విష్ణు హామీ ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios