MAA elections: ఏం చేశారని ప్రకాశ్‌రాజ్‌కు సన్మానం.. ఏపీ ‘‘మా’’ ప్రతినిధులకు థర్టీఇయర్స్ పృథ్వీ వార్నింగ్
విష్ణు ప్యానెల్‌కు (manchu vishnu) చెందిన నటుడు పృథ్వీరాజ్ (pradhvi raj).. ఏపీ ‘‘మా’’ ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్‌ను వారు సన్మానించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రకాశ్‌రాజ్‌కు సన్మానం చేయడం బాధనిపించిందని పృథ్వీ అన్నారు.
మా ఎన్నికలు (maa elections) సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. విమర్శలు, సవాళ్లను దాటి వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. అటు మెగా ఫ్యామిలీ (mega family) తమ మద్ధతు ప్రకాశ్ రాజ్‌కే (prakash raj) వుంటుందని చెప్పడంతో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో విష్ణు ప్యానెల్‌కు (manchu vishnu) చెందిన నటుడు పృథ్వీరాజ్ (pradhvi raj).. ఏపీ ‘‘మా’’ ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్‌ను వారు సన్మానించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రకాశ్‌రాజ్‌కు సన్మానం చేయడం బాధనిపించిందని పృథ్వీ అన్నారు. పాతికేళ్లుగా ప్రకాశ్ రాజ్ ఓటు వేయలేదని ఆయన ఆరోపించారు. కోవిడ్ సమయంలో తాము ఇంటింటికి తిరిగి సేవలు చేశామని పృథ్వీ చెప్పారు. కరోనా (coronavirus) బాధితులకు బెడ్‌లు ఇప్పించామన్నారు.
ఇదిలా ఉండగా, గురువారం చిన్న ట్వీట్‌తో బాంబు పేల్చాడు ఆర్ ఎక్స్ 100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి. మా ఎన్నికలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన రెండు ట్వీట్స్ సంచలనంగా మారాయి. కొత్త అనుమానాలకు తెరలేపాయి. ''ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి 'మా' లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది.ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన "మహాసముద్రం" రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి!!'' అంటూ ఓ ట్వీట్ చేశారు. అనంతరం మరో ట్వీట్ లో ''నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా...(అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)'' అని కామెంట్ చేశారు.
ALso Read:నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే వేషాలు... ఓపెన్ బ్లాక్ మెయిల్.. సంచలనంగా అజయ్ భూపతి ట్వీట్
మా ఎన్నికల హీట్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సందర్భాన్ని తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నట్లు మొదటి ట్వీట్ అనిపించింది. కానీ రెండవ ట్వీట్ చాలా వివాదాస్పదంగా, మా ఎన్నికల నిర్వహణను తప్పుబట్టేదిగా ఉంది. పరోక్షంగా కొందరు దర్శకులు మా సభ్యులను ఓట్ల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని Ajay bhupathi ఆ ట్వీట్ ద్వారా చెప్పారు. తాను కోరుకుంటున్న ప్యానెల్ కి ఓటు వేసిన వారికే, తన సినిమాలలో వేషాలు ఉంటాయని ఆ డైరెక్టర్ బెదిరింపులకు దిగుతున్నట్లు అర్థం అవుతుంది.
కాగా, అక్టోబర్ 10న హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మా ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు. మంచు విష్ణు ప్యానెల్ కోరిక మేరకు ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలోనే నిర్వహిస్తామని మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అధికారికంగా ప్రకటించారు.