దేశం తొలి స్థానంలో ఉండడం బాధాకరం: మంచు మనోజ్

First Published 27, Jun 2018, 4:14 PM IST
manchu manoj tweet on sexual assaultment in india
Highlights

లండన్ కు చెందిన ఓ సర్వే.. ప్రపంచంలో మహిళలు బ్రతకడానికి అత్యంత ప్రమాదకరమైన దేశం 

లండన్ కు చెందిన ఓ సర్వే.. ప్రపంచంలో మహిళలు బ్రతకడానికి అత్యంత ప్రమాదకరమైన దేశం భారతదేశం అని వెల్లడించింది. ఆడవాళ్లపై పెరుగుతున్న అకృత్యాలు, లైంగిక వేధింపులు వంటి విషయాలపై ఇండియా మొదటి స్థానంలో ఉందని తేల్చి చెప్పారు. ఇండియా తరువాత సోమాలియారెండో స్థానంలో ఉండగా, సౌదీ అరేబియా మూడో స్థానంలో నిలిచింది.

ఈ దేశాలలో ఉన్న చట్టాలు మహిళలకు పూర్తి భద్రతను ఇవ్వలేకపోతున్నాయని సర్వే వెల్లడించింది. ఈ విషయంపై స్పందించిన మంచు మనోజ్.. మహిళలకు భారతదేశం ప్రమాదకరంగా మారడం నిజంగా బాధను కలిగించే విషయమని అన్నారు.

'ఈ కేటగిరీలో ఇండియా మొదటి స్థానంలో ఉండడం బాధగా ఉంది. భారత్ మహిళలకు సురక్షితమైన దేశంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది' అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే.. వరుస ఫ్లాప్ లు అందుకోవడంతో హీరోగా సినిమాలు చేయడానికి కొంత గ్యాప్ ఇచ్చాడు. త్వరలోనే ఓ సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.  

 

loader