మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో అతడికి సరైన సక్సెస్ మాత్రం లభించలేదు. త్వరలోనే ఓ సినిమా మొదలుపెట్టబోతున్నాడని టాక్. ఇదంతా పక్కన పెడితే మంచు మనోజ్ అర్ధరాత్రి పబ్ లో చేసిన రచ్చ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

సినీ తారలు పబ్ లో స్నేహితులతో కలిసి చిన్న చిన్న పార్టీలు చేసుకోవడం చాలా కామన్. కానీ అక్కడ జరగకూడని సంఘటనలు ఏమైనా జరిగాయంటే ఇంక అంతే.. వారి ఇమేజ్ సగం డ్యామేజ్ అయినట్లే.. సరదాగా బంజారాహిల్స్ లో ఓ పబ్ కి వెళ్లిన మనోజ్ తాగేసి పబ్ నిర్వాహకులతో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆవేశంతో ఊగిపోయిన హీరో గారు పబ్ లో అద్దాలన్నీ పగలగొట్టడంతో పాటు మ్యూజిక్ సిస్టమ్ ను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

అర్ధరాత్రి పబ్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మంచు మనోజ్పై సెక్షన్ 70డి కింద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశారు. అయితే అసలు గొడవకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే విషయంలో స్పష్టత రావాల్సివుంది!