Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ పై మంచు మనోజ్ కామెంట్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ మంచి స్నేహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు కూడా వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో తారక్ పై ఎవరో చేయి చేసుకున్నారని తెలిసి మంచు మనోజ్ వాడి చేయి కూడా విరగ్గొట్టాడట. 

manchu manoj comments on ntr
Author
Hyderabad, First Published Oct 29, 2018, 10:29 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ మంచి స్నేహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు కూడా వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో తారక్ పై ఎవరో చేయి చేసుకున్నారని తెలిసి మంచు మనోజ్ వాడి చేయి కూడా విరగ్గొట్టాడట.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆ సంగతి గుర్తు చేయమని అడిగితే ఆ విషయం తారక్ నే అడగమని చెప్పాడు మంచు మనోజ్. ఇటీవల హరికృష్ణ మరణించిన తరువాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకి బౌన్సర్ లా మారి క్రౌడ్ నుండి వారికి రక్షణ కల్పించాడు.

ఆ సన్నివేశం చూసిన నందమూరి అభిమానులు మంచు మనోజ్ కి ఫిదా అయిపోయారు. మనోజ్ ని కూడా అభిమానించడం మొదలుపెట్టారు. తాజాగా ఓ నెటిజన్.. ''మనోజ్ భయ్యా ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పు'' అని ప్రశ్నించగా.. 'నా ప్రాణం' అని సమాధానమిచ్చాడు. 

ఈ ఆన్సర్ తో మరింతమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మనోజ్ తిరుపతికి వెళ్లి అక్కడ ప్రజలకి సేవ చేయాలని
నిర్ణయించుకున్నాడు. మరో మూడు నెలల్లో మనోజ్ హీరోగా కొత్త సినిమా మొదలుకానుంది.  

ఇవి కూడా చదవండి.. 

పవన్ పార్టీలోకి మంచు మనోజ్..?

రాజకీయాలకి లింక్ చేయకండి: మంచు మనోజ్

మనోజ్ కొత్త జర్నీ.. ప్రపంచమంతా విస్తరింపజేస్తాడట! 

మంచు మనోజ్ 'లేఖ' వెనక అసలు స్కెచ్ ఇదా?

 

Follow Us:
Download App:
  • android
  • ios