రాజకీయ రంగు పులమొద్దు అంటూ మంచు మనోజ్ ఎంతగా చెప్పినా.. అతడి ప్రవర్తన మాత్రం ఆ విధంగా లేదనేది కొందరి వాదన. తనకి రాజకీయాల మీద ఉన్న ఆసక్తితోనే తిరుపతికి వెళ్లి అక్కడ సేవ చేస్తానంటున్నాడని టాక్.

ఇటీవల అతడు సోషల్ మీడియాలో ప్రజలను ఉద్దేశిస్తూ.. మీ దీవెనలు, ప్రేమ తప్ప ఇంకేం ఆశించడం లేదని అన్నాడు. దీంతో మంచు మనోజ్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో మంచు మనోజ్ కూడా పోటీ చేస్తాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. 

అయితే మనోజ్ ఏ పార్టీలో చేరతాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ కుటుంబంతో ఉన్న బంధం మేరకు అతడు వైఎస్ఆర్ సీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపించొచ్చు.. కానీ మనోజ్ ఆలోచనలు మరో రకంగా ఉన్నాయని టాక్. పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీలో మంచు మనోజ్ జాయిన్ అవ్వడానికి మక్కువ చూపుతున్నాడని ఈ మేరకు జనసేన పార్టీకి సంకేతాలు కూడా అందిస్తున్నాడని సమాచారం.

ఇటీవల సోషల్ మీడియాలో రామ్ చరణ్ గ్రామాల దత్తత విషయంలో మనోజ్.. పవన్ ని పొగుడుతూ పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. మెగాభిమానులు కూడా మనోజ్ ట్వీట్ తో అతడిని తెగ పోగుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

సంబంధిత వార్తలు..

రాజకీయాలకి లింక్ చేయకండి: మంచు మనోజ్

మనోజ్ కొత్త జర్నీ.. ప్రపంచమంతా విస్తరింపజేస్తాడట! 

మంచు మనోజ్ 'లేఖ' వెనక అసలు స్కెచ్ ఇదా?