ప్రేమికుల రోజును గ్రాండ్ గా సెలిబ్రేట్ చేసుకున్న మంచు లక్ష్మి భర్తతో ప్రేమను పంచుకున్న చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టిన లక్ష్మి వేలంటైన్స్ డే అంటే మీరు ప్రేమించే అందరి కోసం అంటున్న లక్ష్మి

వేలంటైన్స్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే తెలుగు సెలబ్రిటీల్లో మంచు లక్ష్మి ప్రసన్న ముందుంటుంది. ఆండీ శ్రీనివాసన్‌ను చాలా ఏళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఆమె....ప్రేమకు చాలా విలువ ఇస్తుంది. ఆండీ లాంటి వ్యక్తి తన జీవితంలోకి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంచు లక్ష్మి గతంలో చాలా సార్లు చెప్పింది.

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచు లక్ష్మి, ఆండీ ప్రేమికులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం, ప్రపంచం మొత్తం ప్రేమతో నిండి పోవాలని ఆకాంక్షించడం ప్రతి ఏడాది మామూలుగా జరిగేదే. తాజాగా ఈ 2017 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచు లక్ష్మి ఓ పోస్టు చేసింది. వాలంటైన్స్ డే అంటే కేవలం మీ పార్టనర్ కోసమే కాదు. మీరు ప్రేమించే అందరి కోసం అంటూ ఆమె ఫేస్ బుక్ లో పేర్కొంది.

అయితే మంచు లక్ష్మి ప్రతి సంవత్సరం ఎన్ని పోస్టు చేసినా... 2014లో ఆమె చేసిన పోస్ట్ చేసి కిస్ ఫోటో హైలెట్. ఆ పోస్ట్ అభిమానులకు ఇంకా గుర్తుంది.

మంచు లక్ష్మి అమెరికాలో చదువుకుని 2006వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొంత కాలం విదేశాల్లో ఉండి తర్వాత ఇండియాకి వచ్చిన మంచు లక్ష్మి తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాస్ వాలంటైన్స్ డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు.