నేను మోసపోయాను.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్!

manchu lakshmi shocking comments
Highlights

తాజాగా ఆమె నటించిన 'వైఫ్ ఆఫ్ రామ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచి లక్ష్మీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ఇండస్ట్రీలో చాలా మంది మోసం చేశారంటూ లక్ష్మీ మంచు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకు పరిచయమైన మంచు లక్ష్మీ సినిమాల్లో నటిస్తూ పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. కెరీర్ లో ముందుకు సాగుతోంది. తాజాగా ఆమె నటించిన 'వైఫ్ ఆఫ్ రామ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచి లక్ష్మీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ఇండస్ట్రీలో చాలా మంది మోసం చేశారంటూ లక్ష్మీ మంచు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇండస్ట్రీలో కొంతమంది వద్ద నుండి తనకు డబ్బులు రావాల్సివుందని ఆమె ఆరోపణలు చేసింది. మోహన్ బాబు కూతురైన ఆమెను ఎవరు మోసం చేస్తారులే అని అంతా అనుకుంటారని కానీ తాను మాత్రం మోసపోవడం నిజమని వెల్లడించింది. సినిమాల కారణంగా చాలా డబ్బు కోల్పోయినట్లు.. 'గుండెల్లో గోదారి' సినిమా అప్పులను ఇప్పటికీ తాను తీరుస్తున్నట్లు స్పష్టం చేసింది. తను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఆపలేదని, తన దగ్గర అప్పు ఎగ్గొట్టిన వ్యక్తి మారు పేరుతో సినిమాలు తీస్తున్నట్లు ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

అయితే ఆమె ఆరోపణలును బట్టి ఆ వ్యక్తి బెల్లంకొండ సురేష్ అయి ఉంటాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి మధ్య కొన్ని వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. లక్ష్మీ మంచుకి సంబంధించిన ఓ సినిమా సెట్ లో షూటింగ్ చేసుకొని బెల్లంకొండ ఆమెకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో అప్పట్లో చాలా గొడవ జరిగింది. మరి లక్ష్మీ ఆయన్ను ఉద్దేశించే కామెంట్స్ చేసిందా..? అనేది తెలియాల్సివుంది. 

loader