హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పందించిన నటి మంచు లక్ష్మి ట్రాఫిక్ లో గంటన్నర పాటు ఇరుక్కుపోయిన మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇక వర్షం పడిన రోజు ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సమయంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామా ఇక అంతే సంగతులు. గంటలు గంటలు ఆ ట్రాఫిక్ లో నిరీక్షించాల్సిందే. ఇలాంటి సమస్య సామాన్య ప్రజలు ఏదో ఒక రోజు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా ఇదే సమస్య నటి మంచు లక్ష్మి కూడా ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

Scroll to load tweet…

నగరంలోని హైటెక్స్ ఏరియాలో ఇటీవల నటి మంచు లక్ష్మీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో 'గంటన్నర సమయం హైటెక్స్‌ ఏరియాలో ట్రాఫిక్ కారణంగా చిక్కుకున్నాను. రాజకీయ నాయకులు మాలాగ సాధారణ పౌరులుగా ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా నగర రోడ్లపై ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో అర్థమవుతోందంటూ' ఆమె ట్వీట్ ద్వారా సమస్యను షేర్ చేసుకున్నారు. చాలామంది నెటిజన్లు ఆమెకు మద్ధతు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు.