ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డుపై మంచు లక్ష్మి సంతోషం

First Published 22, Nov 2017, 5:20 PM IST
manchu lakshmi express happiness about nandi award
Highlights
  • ఇటీవలే నంది అవార్డుల జాబితా ప్రకటించిన ఏపీ సర్కారు
  • కుల వివక్ష చూపారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్కారు
  • తనకొచ్చిన అవార్డు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న మంచు లక్ష్మి
  • ఏపీ సర్కారు తన ప్రతిభను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపిన లక్ష్మి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా పుర‌స్క‌రించే నంది అవార్డు మ‌రోసారి మంచు ఆణిముత్యాన్ని వ‌రించింది. గ‌తంలోనే ఉత్త‌మ ప్ర‌తినాయ‌కురాలిగా అన‌గన‌గా ఓ ధీరుడు సినిమాకు నంది అందుకున్న మంచు ల‌క్ష్మిని ఇప్పుడు మ‌రోసారి నంది వ‌రించింది.

 

చంద‌మామ క‌థ‌లు సినిమాలోని న‌ట‌న‌కు గానూ, మంచు ల‌క్ష్మికి ఉత్త‌మ స‌హాయ‌న‌టి అవార్డుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆమెను గౌర‌వించింది. చంద‌మామ క‌థ‌లు సినిమాలో లీసా స్మిత్ పాత్ర‌లో ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకున్న మంచు ల‌క్ష్మి ఆ పాత్ర‌కు 100% న్యాయం చేసింది. త‌న‌కు ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్య‌క్తం చేసింది. తెలుగు అమ్మాయిగా త‌న‌కెంతో గ‌ర్వంగా ఉంద‌ని, ఈ అవార్డు ఇచ్చిన ఏపీ ప్ర‌భుత్వానికి మంచు ల‌క్ష్మి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 

తాజాగా నంది అవార్డుల ఎంపిక కమిటీపై విమర్శలు తీవ్రమవుతున్న వేళ మంచు లక్ష్మి తనకు నంది అవార్డు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేయటం వివాదాన్ని మరింత రెచచ్చగొడుతుందా లేక మరెటైనా దారి తీస్తుందా అనేది చర్చనీయాంశమైంది.

loader