ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకు వచ్చిన ఓ కుర్రాడు మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కూడా కొంతకాలం పాటు బాగానే రాణించాడు. కానీ ఈ మధ్య కాలంలో అతడికి ఒక్క హిట్టు సినిమా కూడా రావడం లేదు. వరుసగా ఫ్లాపులు పడడంతో నిర్మాతలు కూడా అతడితో సినిమా చేయాలంటే భయపడుతున్నారు. దీనంతటికీ కారణం అతడి మ్యానేజర్ అని సమాచారం.

చాలా మంది అగ్ర హీరోలకి, యంగ్ హీరోలకి మ్యానేజర్ గా వ్యవహరిస్తూ వారి డేట్స్ ను చూసే తెలుగు సినీ ప్రముఖుడు.. ఈ యంగ్ హీరోకి కూడా డేట్స్ చూస్తున్నాడు. మొదట్లో ప్రాజెక్టుల విషయంలో ఫైనల్ డెసిషన్ హీరోనే తీసుకునేవాడు. కానీ మెల్లగా అది కాస్త మ్యానేజర్ చేతిలోకి వెళ్ళిపోయిందట. ఎవరితో ఏ సినిమా చేయాలి..? ఇంతకు డీల్ కుదుర్చుకోవాలి..? వంటి విషయాల్లో హీరో మ్యానేజర్ మాటనే ఫాలో అయ్యేవాడని సమాచారం. కొన్ని సినిమాలైతే కథలు కూడా వినకుండా.. ఓకే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట.

దానికి కారణం డబ్బు అని తెలుస్తోంది. కంటెంట్ కాకుండా డబ్బుకి ప్రాధాన్యతనివ్వడంతో హీరోకి వరుస పరాజయాలు మొదలయ్యాయి, దీంతో ఇప్పుడు ఈ హీరోగారు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. చేతిలో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాడట. దీనంతటికీ కారణం ఆ మ్యానేజర్ అని తెలిసినా అతడికున్న పరిచయాల కారణంగా ఏమీ అనలేక గమ్మునుండిపోయాడట. ఈ హీరో పేరు చెప్పి సదరు మ్యానేజర్ బాగానే డబ్బు వెనకేసుకున్నాడని సమాచారం.