ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి తన కొత్త చిత్రం షూటింగ్ లో గాయపడ్డారు. సజీవ్ పిళ్లై దర్శకత్వంలో రూపొందుతున్న బహుభాషా చిత్రం ‘మామంగమ్’ షూటింగ్ లో ఓ యుద్ధ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో మమ్ముట్టి గాయపడ్డట్టు చిత్ర యూనిట్ పేర్కొంటూ, ఆయనకు స్వల్ప గాయాలయ్యానని తెలిపింది. వెంటనే చికిత్స అందించామని, ఆయన కోలుకుంటున్నారని పేర్కొంది.కాగా, రూ.50 కోట్లతో రూపొందుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి నాలుగు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు పలువురు ‘మామంగమ్’లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉండగా, మమ్ముట్టి నటించిన పెరోల్, అంకుల్, పెరాంబు చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.