నాపై ఆ ముద్ర పడిపోయింది.. ఫోన్ చేసి రమ్మనేవారు!

mallika sherawat sensational comments on casting couch
Highlights

ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా తారలందరూ కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తున్నారు. ఒక్కొక్కరుగా తమకు ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో చెబుతూ వస్తున్నారు. తాజాగా నటి మల్లికా షెరావత్ ఈ విషయంపై స్పందించింది

ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా తారలందరూ కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తున్నారు. ఒక్కొక్కరుగా తమకు ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో చెబుతూ వస్తున్నారు. తాజాగా నటి మల్లికా షెరావత్ ఈ విషయంపై స్పందించింది. తెర వెనుక హీరోలతో చనువుగా లేననే కారణంతోనే చాలా సినిమాల నుండి తనను తీసేసినట్లు వెల్లడించింది. తన ప్రతిభకు తగ్గల్టు అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చాలా వరకు మల్లికా షెరావత్  బోల్డ్ క్యారెక్టర్లలోనే కనిపించారు. దీంతో బయట కూడా ఆమె అలానే ఉండాలని కొందరు ఒత్తిడి చేసేవారట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లికా ఈ విషయాలను చెప్పుకొచ్చింది. 2004 లో 'మర్డర్' అనే చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైంది మల్లికా. ఈ సినిమాలో ఆమె బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. దీంతో అందరూ ఆమె ఇలాంటి పాత్రలకే సరిపోతుందనే ముద్ర వేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సినిమా తరువాత తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని.. సిగ్గు వదిలేసిన మహిళా అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని ఈ కారణంగా మగవారు అలుసుగా తీసుకుంటారని.. సమాజంలో ఇలానే జరుగుతుందని ఇలాంటి అనుభావాలు ఎన్నో ఎదురైనట్లు చెప్పింది. 

మరిన్ని విషయాలు చెబుతూ.. ''హీరోలతో సన్నిహితంగా లేనందుకు చాలా సినిమాల నుండి నన్ను తొలగించారు. తెరపై నటిస్తున్నావు కదా బయట కూడా ఉండడానికి ఏంటి సమస్య అంటూ ప్రశ్నించేవారు. కానీ నేను రాజీ పడలేదు. ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నేను ఇలా స్ట్రిక్ట్ గా ఉండడం వలన నాలోకి నటనా నైపుణ్యాన్ని బయటపెట్టలేకపోయాను. కొందరు దర్శకుడు ఫోన్లు చేసి ఉదయం 3 గంటలకు వచ్చి కవలమని చెప్పేవారు. ఈ విషయాలు బయటకు చెప్పాలంటే.. భయం వేసేది. ఎందుకంటే తప్పు నాదేనని సులువుగా నిందలు వేసేస్తారు. జనం కూడా వాటిని నమ్ముతారు. మీడియా ఎప్పుడూ కూడా నాకు సహాయంగా లేదు. నా గురించి ఏదోకటి రాసి నన్ను బాధ పెడుతూనే ఉండేది. సినిమాలలో బోల్డ్ సీన్స్ లో నటిస్తాను నిజమే.. కానీ ఎలాంటి పరిస్థితుల్లో నటించాల్సి వచ్చిందో ఎవరూ పట్టించుకోరు'' అంటూ తన బాధను వెల్లగక్కింది. 

loader