Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 13వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో మీరా, మల్లీని తలుచుకొని సంతోష పడుతుండగా అప్పుడు ప్రకాష్ నువ్వు అనుకున్నట్లుగా మల్లీ జీవితం ఏం బాగోలేదు అత్త కన్నీళ్ళతోనే కాలం వెల్లదీస్తోంది. అప్పుడు ఏంటి ప్రకాష్ నేను మాట్లాడుతుంటే నువ్వేమో సైలెంట్ గా ఉన్నావు అనగా ఏం లేదు అత్త నువ్వు చెప్తుంటే మల్లీ అక్కడ ఎంత సంతోషంగా ఉందో ఊహించుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు నేను మల్లీకీ చదువు చెప్పే పంతులమ్మతో కూడా మాట్లాడాను అనడంతో ఎవరత్తా అనగా మాలిని అని అనడంతో ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆమె చాలా బాగా మాట్లాడి మల్లీని సంతోషంగా చూసుకుంటానని చెప్పింది అని అంటుంది.
అప్పుడు మీరా వాళ్ళ అమ్మ మీరంతట మీరే సంతోష పడకండి అంటూ దెప్పిపొడుపులు మాటలు మాట్లాడుతుంది. అప్పుడు మీరా సంతోషమంతా పాడవుతుంది. మరొకవైపు మాలిని ఊర్లో ఏదో చిన్న స్కూల్లో చదువుకున్న నేను ఇంత పెద్ద కాలేజీలో చదువుకోడానికి కారణం మాలిని అక్క అరవింద్ బాబు అనుకుంటూ ఉంటుంది. తర్వాత మల్లీ కాలేజీ లోపలికి అక్కడ ఉన్న కొందరు స్టూడెంట్స్ మల్లీ నీ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆడపిల్లలు,మగపిల్లలు అందరూ మల్లీ మీ ర్యాగింగ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు మల్లీని వాళ్ళందరికీ తగిన విధంగా బుద్ధి చెబుతుంది.
మీలాగా నాకు లక్షలు పెట్టి చదివించే వాళ్ళు లేరు అయినప్పటికీ బాగా చదువుకొని ఇంత పైకి వచ్చాను మీరు కూడా ఇలా కామెంట్ చేయడం మానేసి చదువుకోండి అని అంటుంది. ఇంకొకసారి ఆట పట్టించాలని చూస్తే మా మాలిని అక్క ఇక్కడే ఉంటుంది తనతో చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మల్లీ. ఆ తర్వాత మాలిని కాలేజీ ఫ్యాకల్టీ తో మాట్లాడుతూ ఉండగా ఇంతలో మల్లీ అక్క అక్క అని పిలుచుకుంటూ అక్కడికి వస్తుంది. వాళ్ళు చూడక్క ఏదేదో మాట్లాడుతున్నారు అని అనగా ఏమైంది అనడంతో పల్లెటూరు నుంచి వచ్చావు ఎగ్జామ్ ఎలా రాశావు. అంటు నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు అని అంటుంది మల్లీ.
వాళ్లకు ఒకసారి గట్టిగా వచ్చి చెప్పక్క మల్లీ ని ఏమి అనొద్దు ఏమైనా అంటే తాట తీస్తా అని వాళ్లకు చెప్పండి అక్క అని మల్లీ చేతులు పట్టుకొని పిలవగా మాలిని కోప్పడుతూ అసలు నీకు పద్ధతి ఉందా? ఇది కాలేజ్ అనుకున్నావా ఏమనుకున్నావు అని మల్లీ మీద సీరియస్ అవుతుంది. అసలు నీకే పద్ధతి లేదు పద్ధతి తెలియదు నువ్వు వాళ్ల గురించి చెప్పడానికి వచ్చావా అని అంటుంది. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో మల్లీ ఇంట్లో లాగా ఇక్కడ ఉంటాను అంతే కుదరదు. నేను ప్రొఫెసర్ నువ్వు స్టూడెంట్ వి ఇక్కడ అక్క అని పిలవకు అని అంటుంది. కాలేజీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు అవసరమా ఇదంతా అని అనడంతో మల్లీ స్వారీ అక్క అని చెప్పి అక్కడి నుంచి మాట్లాడకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది.
మరోవైపు ఇంట్లో అనుపమ అందరూ మల్లీ గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అరవింద్ నువ్వు వెళ్లి పికప్ చేసుకుని రావచ్చు కదా అనడంతో నాకు కొంచెం పని ఉంది అమ్మ మాలిని మల్లీ ఇద్దరికి ఒకటే సారి కదా కాలేజీ అయిపోయేది ఇద్దరు ఒకేసారి క్యాబ్లో వస్తారులే అని అంటాడు అరవింద్. ఇంతలోనే మాలిని ఒక్కతే క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్లు అమ్మ మాలిని మల్లీ రాలేదా అని ఒక్క దానివే వచ్చావు అనడంతో మల్లీ నాతోపాటు రాలేదు అత్తయ్య నేను ఒక్కదాన్నే వచ్చాను అని అంటుంది మాలిని. దాంతో అరవింద్ తో పాటు వాళ్ళందరూ షాక్ అవుతారు.
అప్పుడు అరవింద్ మాలిని మీద సీరియస్ అవుతూ ఏం మాట్లాడుతున్నావ్ మాలిని మల్లీకీ సిటీ కొత్త కదా అలా ఎలా వదిలేసి వచ్చావు నీకు కుదరకపోతే నాకు ఫోన్ చేసి చెప్తే నేను మల్లీ నీ పికప్ చేసుకునే వాడిని కదా అని అంటాడు. అప్పుడు ఆపు అరవింద్ అని అంటుంది. ఎందుకు ఈ మేటర్ ని అంత సీరియస్ చేస్తున్నావు అనడంతో ఇంతలో మల్లీని చూసి అరవింద్ సైలెంట్ గా ఉండిపోతాడు. అప్పుడు మాలిని ప్రతి ఒక్క విషయంలో మల్లీని కనిపెట్టుకొని ఉండడానికి నేను బాడీగార్డ్ ని కాదు అని అంటుంది. మాలిని మాటలకు ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. బాధ్యత గురించి నువ్వు మాట్లాడుతున్నావా అరవింద్.
రెండు నెలల నుంచి రెండుసార్లు మాత్రమే కాలేజ్ దగ్గరికి వచ్చావు ఏమైనా అంటే పని ఉంది అంటావు. అంటే నాకోసం రావడానికి టైం ఉండదు మల్లీ కోసం రావడానికి నీకు టైం ఉంటుందా అని అంటుంది మాలిని. నీ నుంచి నేను ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాలిని అనడంతో నేను కూడా అరవింద్ అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మల్లీ విషయంలో గొడవ పడుతూ ఉండగా అందరూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటారు. అనవసరంగా మల్లీ ఈ నెత్తిన పెట్టుకున్నాను తన వల్ల ఈరోజు నేను మాటలు పడాల్సి వస్తుంది అని అంటుంది.
మా అమ్మ చెప్పిన రోజు నేను వినలేదు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అని అంటుంది మాలిని. అప్పుడు అనుపమ, మల్లీని లోపలికి రమ్మని పిలుస్తుంది. ఆ తరువాత మాలిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మల్లీ మాలిని అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అరవింద్ అక్కడికి రావడంతో మల్లీ తన బాధను దిగమిందుకొని మాలిని కీ సపోర్ట్ గా మాట్లాడుతుంది.
