ఇటీవలే మళయాల నటిపై లైంగిక దాడి ఘటనను మరిచిపోలేక పోతున్న హీరోయిన్ తోడుగా నిలుస్తున్న కాబోయే భర్త
ఇటీవల లైంగిక వేధింపులకు గురైన మలయాళ నటి మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కౌన్సెలింగ్ తీసుకుంటోంది. ‘కారులో లైంగిక వేధింపులకు గురైనప్పటి నుంచి ఆమె కౌన్సెలింగ్ తీసుకొంటోంది.
'షూటింగ్‌లకు హాజరవుతున్నా... ఘటన జరిగినప్పటి నుంచి ఆమెకు ఆ సన్నివేశాలే వెంటాడుతూ.. సరిగా నిద్ర పట్టడం లేదు. ఒకరకమైన భయాందోళనకు లోనైంది' అని మలయాళ నటి స్నేహితురాలు మీడియాకు వెల్లడించింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో నటికి కొంత ఊరట కలిగింది. త్వరలోనే ఆమె సాధారణ జీవితంలో ప్రవేశిస్తుంది' అనే ఆశాభావాన్ని ఆమె స్నేహితురాలు వ్యక్తం చేసింది.
దారుణమైన మానసిక పరిస్థితిని ఎదుర్కొంటున్న మలయాళ నటికి ఆమె కాబోయే భర్త, సినీ నిర్మాత బాసటగా నిలిచారని తెలుస్తోంది. పీడకల నుంచి త్వరగా బయటపడాలంటే షూటింగ్‌కు వెళ్లాలని పట్టుబట్టారు. ఆమెపై సోమవారం కొన్ని సీన్లను షూట్ చేశారు. ఆమె వెంట కాబోయే భర్త ఉంటున్నాడు. ఆమెకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నాడు. సెట్లో ఇతరుల నుంచి ఎలాంటి అసౌకర్యమైన ప్రశ్నలు రాకుండా జాగ్రత్త తీసుకొంటున్నాడు అని సినీ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఘటన జరిగినప్పటి నుంచి గత కొద్దికాలంగా మలయాళ నటి ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఆమె తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకొంది. ప్రస్తుతం ఆమె ఏకాంత జీవితం గడుపుతోందని ఆమె సన్నిహితులు తెలిపారు.
