పెళ్లి పీటలెక్కబోతున్న మళయాల నటి భావన

malayalam actress bhavana to tie the knot very soon
Highlights

  • త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న మళయాల నటి భావన
  • అక్టోబర్ లో జరగాల్సిన పెళ్లి కిడ్నాప్, రేప్ అటెంప్ట్ కేసుతో వాయిదా
  • తాజాగా తన ప్రియుడు నవీన్ తో వివాహానికి ముహూర్తం ఫిక్స్

మలయాళ నటి భావనపై కిడ్నాప్, రేప్ అటెంప్ట్ కేసుతో గత కొంతకాలంగా ఆమె వార్తల్లో నానుతోంది. అయితే విషాదాలు, వివాదాలతో ఇన్నాళ్లూ వార్తలకెక్కిన భావన తాజాగా శుభవార్తతో పలకరించింది. తెలుగులో 'మహాత్మ', 'ఒంటరి', 'నిప్పు' వంటి చిత్రాల్లో నటించిన భావన తాజాగా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. ఇటీవల ఈమెను కిడ్నాప్ చేసిన విషయంలో స్టార్ హీరో దిలీప్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే భావన తను ప్రేమించిన నవీన్‌తో నిశ్చితార్ధం చేసుకుంది. నిజానికి గత మార్చి నెలలో వీరి ఎంగేజ్మెంట్ జరగగా.. అక్టోబర్‌లో పెళ్లి పెట్టుకున్నారు.

 

కానీ కేసు, మళయాల సూపర్ స్టార్ దిలీప్ అరెస్ట్, తర్వాత పరిణామాల నేపథ్యంలో అనుకున్నట్లుగా ఆమె పెళ్లి మాత్రం జరగలేదు. దీంతో భావన పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ పుకార్లు రేగాయి. ఈ విషయంపై ఆమె కూడా స్పందించలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. పైగా ఈ మధ్య కాలంలో చిత్రసీమలో ఇలా నిశ్చితార్ధాలు జరుపుకోవడం పెళ్లి క్యాన్సిల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. భావన పెళ్లి కూడా అలానే క్యాన్సిల్ అయిందని అంతా అనుకున్నారు.

 

అయితే తన పెళ్లి విషయంలో జగరిగిందంతా దుష్ప్రచారమేనని, అవన్నీ వట్టి పుకార్లేనని తేల్చేస్తూ భావన పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. పెళ్లి ముహూర్తాన్ని అక్టోబర్ నుంచి డిసెంబర్ 22కి వాయిదా వేసుకున్నారట. కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల మధ్యన త్రిస్సూర్‌లో వీరి వివాహం జరగనుంది. మొత్తానికి భావన త్వరలోనే ఓ ఇంటిది కాబోతోందన్నమాట.

loader