మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలంటే మెగా ఫ్యాన్స్ లో ఎంతటి క్రేజ్ వుంటుందో సక్సెస్ రేట్ ను బట్టే చెప్పొచ్చు. అభిమానులు చరణ్ సినిమాల్లో ఒకటీ రెండు తప్ప అన్నీ సూపర్ హిట్ చిత్రాలే చూశారు. పోయిన సంవత్సరం ‘ధృవ’ తో మంచి విజయం అందుకున్న రాంచరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమాలో నటిస్తున్నారు.  అయితే ఈ సినిమాలో చరణ్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడట.

 

ఈసారి రామ్ చరణ్ లుక్ చాలా డిఫరెండ్ గా భారీ గడ్డంతో కొత్త లుక్స్ లో వుంటుందట.  ఇప్పటి వరకు ఈ తరహా సబ్జెక్ట్ కూడా తెరపై రాలేదని చిత్ర యూనిట్ అంటున్నారు. షూటింగ్ మొదలు పెట్టి చాలా రోజులయినా ఫస్ట్ లుక్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు.  చిత్రానికి సంబంధించిన లోకేషన్ పిక్చర్స్ తప్ప ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. దీంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి... ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నామని డేట్ టైమ్ ఇచ్చేశారు.  అయితే ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రంగస్థలం’ ఫస్ట్‌ లుక్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది.

 

ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను మొదట డిసెంబర్‌ 8 సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించి తరువాత వాయిదా వేసింది. మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో తాజాగా డిసెంబర్‌ 9 (శనివారం) ఉదయం 9గంటలకు ‘రంగస్థలం 1985’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చేసింది చిత్రయూనిట్.

 

దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న రంగస్థలం మూవీ ఆడియో రైట్స్‌ను ‘లహరి’ మ్యూజిక్ రూ.1.6 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మార్చి నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.