ADIVE SESH MAJOR: అడవి శేష్ కు మేజర్ టీమ్ బర్త్ డే విషెష్.
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ కు, మేజర్ టీమ్ బర్త్ డే విషెష్ తెలిపారు. శేష్ హ్యాండ్సమ్ లుక్ తో ఉన్న ఇమేజ్ తో.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్... మరోసారి మూవీ రిలీజ్ డేట్ ను గుర్తు చేశారు.
అడవిశేష్ తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే సినిమాలు తీసే హీరో. తన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. త్వరలో మేజర్ సినిమాతో రాబోతున్నాడు శేష్. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ‘మేజర్’ సినిమాతో రాబోతున్నాడు శేష్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్, టీజర్ కి మంచి స్పందన వచ్చి సినిమా పై అంచనాలు పెంచాయి.
ప్రపంచ వ్యాప్తంగా మేజర్ సినిమాను పిబ్రవరి11న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈరోజు (డిసెంబర్ 17) అడవి శేష్ బర్త్ డే సందర్భంగా మేజర్ హీరోకు బర్త్ డే విశెష్ తెలియజేస్తూ.. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీటీమ్. హ్యాపీ బర్త్ డే శేష్ అడవి అంటూ హ్యాండ్ సమ్ లుక్ తో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్.
మేజర్ మూవీ ఫిబ్రవరి 11న రిలీజ్ కాబోతోంది అంటూ గతంలోనే వీడియో టీజర్ తో పాటు అనౌన్స్ చేశారు టీమ్. కరోనా వల్ల షూటింగ్ డిలై అవ్వడం..కరోనా ఇబ్బందితో పాటు ఈమధ్య అడవి శేష్ కు ఆరోగ్యం పాడవడం...హాస్పిటలైజ్ అవ్వడంతో.. సినిమా షూటింగ్ ఇంకా లేట్ అయ్యింది. దాంతో ముందే రిలీజ్ అవ్వాల్సిన మేజర్ నెక్ట్స్ ఇయర్ కు పోస్ట్ పోన్ అయ్యింది.
Also Read : PUSHPA- KGF: ఆ విషయంలో KGF హిట్ అయితే.. పుష్ప మాత్రం ఫట్ అయ్యింది... ఎందుకు...?
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న మేజర్ మూవీని గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా ఈ సినిమాని డైరెక్టర్ చేశాడు. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా పాలు పంచుకున్నాడు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేష్ ఈ సినిమాని సోనీ పిక్చర్స్, ఏప్లస్ఎస్ మూవీస్ తో కలిసి నిర్మిస్తున్నారు. మేజర్ నుంచి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన మేకింగ్ వీడియోస్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.