PUSHPA- KGF: ఆ విషయంలో KGF హిట్ అయితే.. పుష్ప మాత్రం ఫట్ అయ్యింది... ఎందుకు...?
ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది అల్లు అర్జున్ పుష్ప మూవీ. కాని అనుకున్నంత రేంజ్ లో హిట్ టాక్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ముఖ్యంగా BGM విషయంలో పుష్పకు దెబ్బపడినట్టు తెలుస్తోంది.
ప్రస్తుంతం ఇండస్ట్రీలో పుష్ప హడావిడి నడుస్తుంది. సినిమా రిలీజ్ అయ్యింది. కాని అనుకున్నంత పాజిటీవ్ టాక్ రాకపోవడంతో.. ఏంటీ ప్రాబ్లమ్ అని వెతుక్కోవల్సిన పరిస్థితి. కథ పక్కన పెడితే. బిజియం విషయంలో రెచ్చిపోయి.. హీరో ఎలివేషన్ సీన్స్ కోసం BGM ను గట్టిగా వాడుకుని హిట్ కొన్ని సినిమాలు చాలా ఉన్నాయి. దాని కోసం హీరోకు స్టార్ డమ్ అవసరం లేదు... కరెక్ట్ టేకింగ్.. ఎమోషన్.. దానికి తగ్గట్టు BGM ఉంటే సరిపోతుంది.
Pushpa Pre release event
ఇప్పుడు పుష్ప విషయంలో దెబ్బకొట్టిన పాయింటే..గతంలో కెజియఫ్ విషయంలో సూపర్ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. యష్ కన్నడాలో స్టార్ కావచ్చు కాని పాన్ ఇండియాకు ఆయన కొత్త హీరో.అయినా సరే సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ సాధించింది. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. యష్ ను స్టార్ హీరోను చేసింది.
కెజియఫ్ సినిమా విడుదలైనప్పుడు ట్రైలర్ ఒకింత బజ్ క్రియేట్ చేసినప్పటికీ... యాష్ అప్పటికి అంత పెద్ద యాక్టర్ కాదు. కానీ Kgf దెబ్బకు పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు. అంతే కాదు ఇప్పుడు Kgf 2 కోసం యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఒక్క సినిమాతో యష్ ఇమేజే మారిపోయింది.
ఇక్కడ పుష్ఫ, కెజియఫ్ రెండు సినిమాల గురించి చూసుకుంటే ఈ రెండు సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. తేడా ఎక్కడ వచ్చిందంటే.. కెజియఫ్ లో కూడా పుష్ప మాదిరి.. అచ్చంగా ఊర మాస్ ఎలెమెంట్స్ ఉంటాయి. రెండు పార్ట్శ్ లో హీరో కూడా రస్టిక్ గ ఉంటాడు. ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కానీ ఆ సినిమాలో ఎలేవేషన్, దానికి వెనుక BGM విషయలో కెజియఫ్ నెక్స్ట్ లెవెల్. కానీ పుష్పాలో ఆ మేజర్ థింగ్ మిస్సయ్యింది.
పుష్ప BGM చాల డల్ గా ఉంది. ఆ స్థాయి సినిమాకు ఉండాల్సినంత లేదు. BGM బాగుంటే సినిమాలు ఏ లెవెల్ లో హిట్ అవుతాయి అనడానికి KGF, బాహుబలి తో పాటు రీసెంట్ గా సూపర్ హిట్ అయిన అఖండ సినిమా బెస్ట్ ఉదాహరణ. అఖండ కోసం తమన్ ఇచ్చి BGM థియేటర్ లో ఆడియన్స్ ను సీటులో కూర్చోనివ్వదు. దానికి బాలయ్య యాక్షన్ తోడై సినిమా దడదడలాడించింది.
పుష్ప పాటల విషయంలో రచ్చ రచ్చ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. పాటలు దుమ్మురేపాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా.. పుష్ప పాటలే మారు మోగుతున్నాయి. కాని BGM విషయంలోనే కొంచెం గట్టిగా వర్కౌట్ చేయాల్సింది. ఈ విషయంలో తమన్ బాగా ఆలోచించాడు. అఖండ సినిమాకు తనను తాను మార్చుకుని.. కొత్త వర్క్ చూపించాడు.
సినిమాలో ఒక షాట్ ని సీన్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో BGM తెలియకుండానే ప్రేక్షకుల మనస్సులో ఒక ఇంపాక్ట్ చేస్తుంది . అది సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే సీన్లలో షాట్ ప్రాధాన్యత ఎంత ఉంటుందో BGM పాత్ర అంత ఉంటుంది. కానీ ఇక్కడ ఆ విషయంలో మాత్రం పుష్ప ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.