సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార పుట్టిన రోజు నేడు. ఈ రోజు సితార ఆరో పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మహేష్ ట్వీట్ చేశారు. ‘‘ నా సర్వస్వం.. ఈరోజు ఆరో పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ పుట్టిన రోజు సందర్భంగా నువ్వు కోరుకున్నవన్నీ జరగాలి.  ఐలవ్ యూ సీత పాప’’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. 

 

మహేష్.. నటి నమ్రతను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి గౌతమ్ అనే కుమారుడు, సితార అనే కుమార్తె ఉన్నారు. ఈ ఏడాది మహేష్ భరత్ అనే నేను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా .. ప్రస్తుతం మహేష్ వంశీపైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.