కొరటాలకు మహేష్ ఇచ్చే గిఫ్ట్ ఇదే!

mahesh babu to gift a costly villa to director koratala siva
Highlights

మహేష్ ఇండియాకు తిరిగిరాగానే కొరటాల కోసం అత్యంత విలువైన ఓ విల్లాను బహుమతిగా ఇవ్వబోతున్నాడని సమాచారం

మహేష్ బాబు మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న సమయంలో 'శ్రీమంతుడు' సినిమాతో భారీ విజయాన్నే అందించాడు దర్శకుడు కొరటాల శివ. అప్పట్లో ఈ సినిమా నాన్బాహుబలి రికార్డ్స్ ను తిరగరాసింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తనకు అంతటి భారీ విజయాన్ని అందించిన కొరటాలకు మహేష్ అప్పుడు రూ. 50లక్షల విలువైన ఆడి కార్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే ఈ సినిమా తరువాత మహేష్ నటించిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యాయి. మహేష్ కెరీర్ మళ్ళీ ఇబ్బందుల్లో పడింది.

ఈసారి కూడా కొరటాల రంగంలోకి దిగి 'భరత్ అనే నేను' సినిమా చేశాడు. అందరూ కోరినట్లుగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రెండు రోజుల్లోనే వంద కోట్లు క్రాస్ చేసి రెండు వందల కోట్లు దిశగా పరుగులు తీస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. ఈ సినిమా హిట్ తో ప్రస్తుతం మహేష్ తన కుటుంబంతో కలిసి ఫారిన్ కు వెకేషన్ కు వెళ్ళాడు.

కొరటాల కూడా తన కుటుంబంతో కలిసి ట్రిప్ కు వెళ్ళారు. అయితే ఈసారి మహేష్ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడనే విషయంలో ఆసక్తి నెలకొంది. మహేష్ ఇండియాకు తిరిగిరాగానే కొరటాల కోసం అత్యంత విలువైన ఓ విల్లాను బహుమతిగా ఇవ్వబోతున్నాడని సమాచారం. మొహానికి అటు విజయాలు ఇటు గిఫ్ట్ లతో కొరటాలకు అద్రుష్టం బాగానే కలిసొస్తోంది. 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader