మహేష్ బాబు హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన స్పైడర్ స్పైడర్ రిలీజ్ రేపే ఇప్పటికే ఫస్ట్ రివ్యూ రిలీజ్ చేసిన ఉమైర్ సంధూ

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాక దక్షిణాది సినీ ప్రేక్ష‌కులు అంతా ఈ దసరా సీజన్ లో వస్తోన్న మహేష్ బాబు స్పైడర్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. మురుగ‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడ‌ర్ థియేట‌ర్స్ కు రావటానికి ఇక కేవలం కొన్ని గంట‌లు మాత్రమే సమయం మిగిలి ఉంది.

స్పైడర్ రివ్యూకు ఇంకా సమయం వున్నా... ఫ‌స్ట్ రివ్యూ అప్పుడే వ‌చ్చేసింది. భారతీయ సినిమాల విడుదలకు ముందే వాటి రివ్యూ, రేటింగ్స్ ఇచ్చే దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు, మూవీ మార్కెటింగ్ నిపుణుడు ఉమైర్ సంధు మహేష్ బాబు స్పైడ‌ర్ సినిమా ఫ‌స్ట్ రివ్యూతో పాటు రేటింగ్ కూడా ఇచ్చేశాడు.

స్పైడ‌ర్ సినిమా అదిరిపోయే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని ఉమైర్ సంధూ చెప్పేశాడు. అంతా ఊహించినట్లుగానే... స్పైడ‌ర్ మూవీహీరో , విల‌న్ మ‌ధ్య అదిరిపోయే మైండ్‌గేమ్‌తో న‌డుస్తుంద‌ట‌. తాను ఎవ్వ‌రో తెలియ‌కుండా స‌మాజానికి కీడు చేస్తూ.. ప్ర‌మాదకారిగా మారిన విల‌న్ ఆట‌ను హీరో క‌ట్టించాడు అన్న‌దే స్పైడ‌ర్ స్టోరీ అని ఉమైర్ చెప్పాడు. 

ఇక ఈ విల‌న్‌ను క‌నిపెట్టేందుకు హీరో వేసే ఎత్తులు, పై ఎత్తులు సూప‌ర్బ్‌గా ఉంటాయ‌ని చెప్పిన ఉమైర్ సినిమా మొత్తానికి క్లైమాక్స్ అదిరిపోతుంద‌ని చెప్పాడు. ఈ క్లైమాక్స్‌కు ప్ర‌తి ఒక్క‌రు మెస్మ‌రైజ్ అయిపోతార‌ట‌. అటు క్లాస్ ను, ఇటు మాస్ ను అలరించే విధంగా తయారైన 'స్పైడర్', ఈ దసరాకు బ్లాక్ బస్టరేనని తేల్చారు.

మ‌హేష్ ఎప్ప‌టిలాగానే త‌న‌దైన స్టైల్లో నటన కుమ్మేశాడని, ఇక విల‌న్‌గా చేసిన ఎస్‌.జె.సూర్య యాక్షన్ కూడా పీక్ స్టేజ్‌లో ఉంటుంద‌ని ఉమైర్ చెప్పాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ కూడా తన పాత్రకు న్యాయం చేసిందనీ, హీరో స్నేహితుడి పాత్రలో ప్రియదర్శి, ఇతర తారాగణం బాగానే నటించారంటున్నారు. 

ఈ ద‌స‌రాకు మ‌హేష్ అభిమానులు పండ‌గ షురూ చేసుకోవ‌చ్చ‌ని చెప్పిన ఉమైర్ స్పైడ‌ర్‌కు 3.5 / 5 రేటింగ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాకు సైతం ఇదే రేటింగ్ ఇవ్వటం విశేషం.