సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే పీపుల్స్ ప్లాజాలో భారీ ఎత్తును నిర్వహించారు. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల మహేష్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వెంకటేష్, విజయ్ దేవరకొండ అతిథులుగా విచ్చేసి సీడీ లాంచ్ చేశారు.

ఈ సంధర్భంగా హీరో మహేష్ బాబు మాట్లాడుతూ.. ''తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారు. ఇప్పటి యంగ్ హీరోల్లో నేను అభిమానించేది విజయ్ దేవరకొండని. వారిద్దరూ ఇక్కడ ఉండడం సంతోషంగా ఉంది. నన్ను హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్రరావు గారికి థాంక్స్ చెప్పాలి. నేను యాక్టింగ్ చేయగలనని నిరూపించిన సినిమా 'మురారి'.. అది తీసిన కృష్ణవంశీ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. నన్ను స్టార్ చేసిన సినిమా 'ఒక్కడు' దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.. గుణశేఖర్ గారిని థాంక్స్. నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా 'అతడు'.. అది తీసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ 'దూకుడు' ఆ సినిమా చేసిన శ్రీనువైట్ల గారికి థాంక్స్. రెండు సార్లు నాకు లైఫ్ ఇచ్చిన కొరటాల శివ గారికి ఋణపడి ఉంటాను. ఇప్పుడు నా 25వ సినిమా తీసిన వంశీ నాకు సోదరుడు లాంటి వాడు. నిజానికి వంశీ కథ చెప్పడానికి వచ్చినప్పుడు పది నిమిషాలు విని పంపించేద్దాం అనుకున్నా(నవ్వుతూ).. అప్పటికే రెండు సినిమాల కమిట్మెంట్స్ ఉండడంతో కుదరదు అనుకున్నా కానీ నేరేషన్ వినగానే  నచ్చింది. టైమ్ పడుతుందని చెప్పాను.. దానికి ఆయన పర్లేదు సర్ వెయిట్ చేస్తా అన్నాడు.. దానికి ఆయన ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకోసం రెండేళ్లు ఎదురుచూశారు. దేవిశ్రీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ముగ్గురు నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు'' అంటూ చెప్పుకొచ్చారు. 

'మహర్షి' రికార్డులు బద్దలు కొడుతుంది : వెంకటేష్

మహేష్ ని 'సర్' అని పిలవడం కష్టంగా ఉంది.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ (సెట్ 4 )

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ (సెట్ 3 )

మహర్షి ఈవెంట్.. నరేష్ సింపుల్ కామెంట్స్!

మహర్షి ట్రైలర్: ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నా