మహర్షి ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. మహేష్ బాబు 25వ చిత్రం కావడంతో ఈవెంట్ కు భారీ అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. అయితే సినిమాలో కీలకపాత్రలో నటించిన అల్లరి నరేష్ ఎలాంటి ఆర్బాటం లేకుండా సింపుల్  గా తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.   

నరేష్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిష్టాత్మక వేడుకలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు 25వ చిత్రంలో నటించడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. సినిమాను నిర్మించిన ముగ్గురి నిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడే సినిమా గురించి ఏమీ చెప్పలేను. 

సక్సెస్ మీట్ లోనే అన్ని మాట్లాడతా. మహేష్ బాబు 25వ సినిమా మహర్షి తప్పకుండ బ్లాక్ బస్టర్ హిట్టవుతుంది. నన్ను కామెడీ యాంగిల్ లోనే కాకుండా కొంచెం సీరియస్ యాంగిల్ లో కూడా చూపించారు. ఇంత మంచి క్యారెక్టర్ కోసం నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వంశి గారికి కృతజ్ఞతలని నరేష్ మిగతా విషయాలన్నీ సక్సెస్ మీట్ లో చెబుతానని స్పీచ్ ను ముగించారు.