ఏ ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు?

Mahesh Babu’s 25th movie to go on floors from June 10th
Highlights

స్టే ఉన్నా షూటింగ్ కు రెడీ

మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. జూన్ 10 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. డెహ్రాడూన్ లో సినిమా షూటింగ్ మొదలుకానుంది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి కోర్టులో స్టే ఉంది.

ఈ సినిమా తనతో చేస్తానని చెప్పి మరో నిర్మాతతో వంశీ సినిమా చేస్తున్నాడని పివిపి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు స్టే విధించింది. ఈ నెల 4న కేసుకి సంబంధించిన హియరింగ్ ఉంది. కానీ వాయిదా పడింది. ఇలాంటి సందర్భంలో స్టే కు వ్యతిరేకంగా చిత్రబృందం ఏ ధైర్యంతో ముందుకు వెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పివిపి గనుక కంటెంప్ట్ గా కోర్టు దిశగా వెళ్తే.. ఈ ఇష్యూ మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. ఈ విషయాలేవీ పట్టించుకోకుండా నిర్మాత దిల్ రాజు అండ్ టీమ్ షూటింగ్ కు కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. మహేష్ కూడా టూర్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కు వచ్చేశారు. మరి దిల్ రాజు.. పివిపితో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నాడా..? లేదా అనేది తెలియాల్సివుంది! 
 

loader