అమ్మాయిలతో మహేష్ సరదాలు చూశారా..?

mahesh babu rounded up by lady fans
Highlights

రీసెంట్ గా ఓ ప్రముఖ కంపెనీ తమ షోరూమ్ ను ప్రమోట్ చేస్తూ మహేష్ తో ఓ యాడ్ ను రూపొందించారు. దీనికి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరిగింది. అక్కడ షూటింగ్ స్పాట్ నుండి ఓ ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో దర్శనమిస్తోంది

సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు ఎంత పెరిగినా అమ్మాయిల్లో ఆయన క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదనే చెప్పాలి. తన స్మార్ట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకునే ఈ రాజకుమారుడు ఇండస్ట్రీలో అగ్రహీరోగా వెలుగొందుతున్నాడు. ఓ పక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరో పక్క పలు కంపెనీలకు ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వాణిజ్య ప్రకటన విషయంలో మహేష్ కు పోటీగా మరో తెలుగు హీరో సరిపోడు.

రీసెంట్ గా ఓ ప్రముఖ కంపెనీ తమ షోరూమ్ ను ప్రమోట్ చేస్తూ మహేష్ తో ఓ యాడ్ ను రూపొందించారు. దీనికి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరిగింది. అక్కడ షూటింగ్ స్పాట్ నుండి ఓ ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో దర్శనమిస్తోంది. ఇప్పుడు ఆ ఫోటో కాస్త ట్రెండింగ్ గా మారి మహేష్ అభిమానులను ఆకర్షిస్తోంది. అమ్మాయిల మధ్యలో ఉన్న మహేష్ లుక్ నెటిజన్లను మెప్పిస్తోంది.

ప్రస్తుతం మహేష్.. వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేసే ఛాన్స్ ఉంది. 

loader