మురుగ‌దాస్ డైరెక్ష‌న్ లో న‌టిస్తున్న మ‌హేష్ బాబు మ‌హేష్ సినిమా టైటిట్ పైనే ఇప్పుడు అంద‌రి దృష్టి ఈ నెల 10న మూవీ టైటిల్ రిలీజ్ చేయనున్న మ‌హేష్ బాబు
ఆఖరికి ఆయన మూడు టైటిళ్లు సెమీ ఫైనల్ లిస్ట్ లోకి తీసుకువచ్చి, దర్శకుడు మురుగదాస్ కు ఫైనల్ బాధ్యత అప్పగించేసినట్లు వినికిడి.
లీకులు వద్దు. నేరుగా 10న సాయంత్రం 7 గంటలకు వీటిల్లో మీకు నచ్చిన టైటిల్ ను ట్వీట్ చేసేయండి అని దర్శకుడు మురుగదాస్ కు మహేష్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది.
వీటిల్లో 'సంభవామి' టైటిల్ అగ్రస్థానంలో వుంది. 'కర్త' అన్న టైటిల్ కూడా ఆలోచించారు కానీ మళ్లీ వీటో చేసారు. 'సంభవామి' టైటిల్ విషయంలో తొలుత కాస్త ముందు వెనుకలాడిన మహేష్ బాబు మనసు కాస్త మార్చుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తం మీద మహేష్ సినిమా టైటిల్ ఏమిటన్నది శుక్రవారం సాయంత్రం విడుదలవుతుంది.
