ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్ కూడా ఉన్నారు : శ్రీరెడ్డి

First Published 30, Mar 2018, 4:14 PM IST
Mahesh Babu is doing in NTR says Sri reddy
Highlights
ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్ కూడా ఉన్నారు

ఇటీవ‌ల కాలంలో తెలుగు న‌టీ న‌టుల‌కు సినీ ఇండ‌స్ర్టీలో జ‌రుగుతున్న అన్యాయంపై గాయ‌త్రి గుప్తా, శ్రీ‌రెడ్డి పెద‌వి విప్పిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, శ్రీ‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో ప‌లువురు డైరెక్ట‌ర్లు, హీరోలు, ప్రొడ్యూస‌ర్లు హీరోయిన్ల‌పై, అలాగే తోటి న‌టీమ‌ణుల‌పై చేస్తున్న‌ లైంగిక దాడుల‌పై పెద‌వి విప్పింది. అలాగే, తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో క‌మిట్‌మెంట్ లేనిదో న‌టుల‌కు అవ‌కాశం ఇవ్వ‌రంటూనే బోల్డ్ వ్యాఖ్య‌ల‌తో బ‌హిరంగంగానే చెప్పంది శ్రీ‌రెడ్డి. 

రీసెంట్ గా ఈ భామ తన ఫాలోయర్స్ లో లైవ్ ఛాట్ కూడా చేసింది. ఈ సందర్భంగా.. ఇప్పటివరకూ బైటకు రాని ఓ కొత్త అప్ డేట్ కూడా ఇచ్చింది. నిన్ననే ఎన్.టీ.ఆర్. బయోపిక్ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ చిత్రం తేజ దర్శకత్వంలోనే రూపొందుతుండగా.. ఇందులో శ్రీరెడ్డికి ఓ రోల్ ఆఫర్ చేసినట్లుగా టాక్. అంతేకాదు.. ఈ సినిమాలో మహేష్ బాబు కూడా నటిస్తున్నాడంటూ చెప్పి.. శ్రీరెడ్డి షాక్ ఇచ్చేసింది. ఎన్.టీ.ఆర్ బయోపిక్ లో.. అంటే బాలకృష్ణ హీరోగా నటించే సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేయడం అనే పాయింట్.. అందరినీ ఆశ్చర్యానికి గురిం చేసింది.

బాలయ్య- మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా అంటూ చాలాకాలంగానే మాటలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటివరకూ ఇది సాధ్యం కాలేదు. కానీ ఎన్.టీ.ఆర్. బయోపిక్ ద్వారా ఇది సుసాధ్యం కాబోతోందని అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే.. ఎన్.టీ.ఆర్. మూవీలో హీరో అండ్ ఫ్యామిలీ రోల్స్ కాకుండా చాలానే అతిథి పాత్రలు ఉంటాయట.

loader