తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు.  ఆయన నటించిన సినిమాలు హిట్టూ, ఫ్లాప్ అనే భేదాలు లేకుండా ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. శ్రీమంతుడు హిట్ తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి భారీ డిజాస్టర్ చవిచూశారు మహేష్ బాబు.  ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటిస్తున్నారు. 

 

 

ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  భరత్ అనే నేను చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ భారీ అంచనాలే పెంచుతున్నాయి.   ఇక మహేష్ బాబు ఫ్యామిలీ విషయానికి వస్తే..చాలా మంది హీరోలకు భిన్నంగా ఉంటారు.  తన సినిమా విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులతో ఫారిన్ టూర్ తప్పకుండా వెళ్తారు.  కొన్ని రోజుల వరకు భార్యా పిల్లలతో ఎంజాయ్ చేసి తర్వాత కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.  ఎంత పెద్ద టాప్ హీరో అయినా..తన కూతురికి తనే పెద్ద ఫ్యాన్‌ అని పలుమార్లు చెప్పారు.

 

ఆయన ముద్దుల కూతురు సితారా అచ్చం వాళ్ల నాన్నమ్మ ఇందిరా దేవిలానే ఉందన్నారు.  మంగళవారం ఇన్‌స్టాగ్రాంలో తన పాప ఫోటో ఫోస్ట్‌ చేస్తూ  ‘ పింక్‌.. గర్ల్‌ పవర్‌.. చూడ్డానికి అచ్చం మా అమ్మలాగే ఉంది’ అని పోస్ట్‌ చేశారు. అంతే కాదు ఈ ఫోటోతో పాటు హార్ట్‌ సింబల్స్‌ను కూడా జత చేశారు. ఈ ఫొటోకు అభిమానుల నుంచి పెద్ద సంఖ్యలో లైక్స్‌ వచ్చాయి. తమ అభిమాన నటుడి కూతురు  సితార చాలా ముద్దుగా ఉంది అంటూ కామెట్స్‌ చేశారు.