Samantha Item Song: మహేష్ చేస్తే తప్పు.. నువ్వు చేస్తే ఒప్పా సమంత?


పుష్ప (Pushpa)మూవీలో సమంత చేసిన 'ఊ అంటావా మావా... ఊ ఊ అంటావా మావా' సాంగ్ అనేక వివాదాలకు కారణమవుతోంది. తాజాగా మహేష్ ఫ్యాన్స్ సైతం ఈ సాంగ్ కారణంగా ఆమెను నిలదీస్తున్నారు. 


 

mahesh babu fans trolls samantha this is why

కెరీర్ లో మొదటిసారి సమంత ఐటెం సాంగ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప లో ఆమె 'ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా' సాంగ్ లో బోల్డ్ స్టెప్స్, స్కిన్ షోతో రెచ్చిపోయారు. పాటలోని లిరిక్స్ తో పాటు సమంత లుక్ నాటుగా, ఘాటుగా ఉన్నాయి. కాగా ఈ సాంగ్ లో సమంత మేల్ డాన్సర్స్ ఛాతీపై కాలు వేసి.. ఓ స్టెప్ పెర్ఫార్మ్ చేశారు. సమంత చేసిన ఈ స్టెప్ మహేష్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడానికి కారణమైంది.

2014లో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ 'వన్ నేనొక్కడినే' చిత్రం చేశారు. ఈ మూవీలోని 'హల్లో రాక్ స్టార్ ఐ యామ్ సింగిల్' అనే సాంగ్ ని అప్పట్లో ఫెమిస్ట్స్ తప్పుబట్టారు. సాంగ్ లో భాగంగా హీరోయిన్ కృతి సనన్ మహేష్ (Mahesh)అడుగు జాడలను చేతితో తాకుతూ... ఆయన్ని అనుసరిస్తూ ఉంటుంది. తనని లవ్ చేయాలని హీరోయిన్  హీరో వెంటపడే నేపథ్యంలో వచ్చే సాంగ్ అది. మహేష్ పాద ముద్రలను హీరోయిన్ చేతితో తాకడాన్ని సింగర్ చిన్మయి తప్పుబట్టారు. 

అబ్బాయికి అమ్మాయి అంతలా దాసోహమైనట్లు చూపించాలా? ఇది మా స్త్రీ జాతికే అవమానం అంటూ, ఓ వివాదం తెరపైకి తెచ్చారు. అలా సదరు సన్నివేశాన్ని వ్యతిరేకించిన వాళ్లలో సమంత కూడా ఉన్నారు. అది జరిగి చాన్నాళ్లు అవుతుండగా, మహేష్ ఫ్యాన్స్ తెరపైకి తీసుకువచ్చారు. 'ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా, సాంగ్ లో సమంత ఏకంగా మేల్ డాన్సర్ గుండెలపై కాలు పెట్టారు.

 కేవలం మహేష్ కాళ్ళ అడుగుజాడలు తాకినందుకు విమర్శించిన నీవు, ఇప్పుడు చేసింది ఏమిటీ?  గుండెలపై కాలు పెట్టడం కంటే మహేష్ చేసింది తప్పా? అంటూ సమంతను నిలదీస్తున్నారు. మహేష్ చేస్తే తప్పు, నువ్వు చేస్తే ఒప్పా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి మహేష్ అభిమానుల ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతుందో లేదో చూడాలి. 

Also read Samantha: ట్రెండింగ్ లో సమంత ఐటమ్ సాంగ్...పాట కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..?

హీరోయిన్ గా సూపర్ ఫార్మ్ లో ఉన్న సమంత (Samantha) మహేష్ వంటి సూపర్ స్టార్ సినిమాపై విమర్శలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. సినిమా పాటలోని ఓ సన్నివేశాన్ని తీసుకొని మహేష్ కి ఆడవాళ్ళ పట్ల గౌరవం లేదు, మహిళలను కించపరిచారని అనడం సరికాదని అప్పట్లోనే సమంతను ట్రోల్ చేయడం జరిగింది. 

Also read Samantha-Naga Chaitanya:కుటుంబ గౌరవం అంటూ నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్... సమంత ప్రవర్తన గురించేనా!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios