తమ అభిమాన హీరోలను తక్కువ చేసి మాట్లాడితే ఫాన్స్ అసలు ఊరుకోరు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. రీసెంట్ గా ఆర్టిస్ట్ ఆదర్శ్ బాలకృష్ణ.. ఎన్టీఆర్ తో తీసుకున్న ఫోటో షేర్ చేస్తూ ఎన్టీఆర్ ని గౌరవంగా సంబోధించలేదని అభిమానులు అతడిపై విరుచుకుపడ్డారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే 'గూఢచారి' హీరోయిన్ శోభిత దూళిపాళ్లకి ఎదురైంది.

'గూఢచారి' సినిమా హిట్ అయిందని మహేష్ బాబు టీమ్ కి శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు. దానికి స్పందనగా శోభిత 'థాంక్యూ' అని చెప్పింది. ఈ ఒక్క ట్వీట్ తో ఆమె సమస్యల్లో ఇరుక్కుంది. 'థాంక్యూ' అని చెప్పి ఊరుకోవడం ఏంటి..? రెస్పెక్ట్ ఎక్కడ అంటూ శోభితను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వారి ఉద్దేశం ప్రకారం 'థాంక్యూ మహేష్ బాబు గారు' అనో లేక 'థాంక్యూ సూపర్ స్టార్' అనో రిప్లై చేయాలట.

ఊరికే థాంక్స్ చెప్పి ఊరుకోవడానికి అతడేమైనా.. సాధారణ వ్యక్తా అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఈ చేదు అనుభంతో ఇంకెత జాగ్రత్తగా ఇండస్ట్రీలో వ్యవహరించాలో.. శోభితకు బాగానే బోధపడినట్లుంది.